ఒక టాప్ హీరో సినిమాకు ఓవర్సీస్ లో కేవలం పది రోజులలో మూడు మిలియన్ డాలర్ల కలక్షన్స్ వస్తే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా ప్రచారం చేస్తారు. అయితే ‘సాహో’ మూడు మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి కూడ ఫెయిల్యూర్ మూవీగా మిగిలిపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

దీనికి కారణం ఈ సినిమా పై ఉన్న మోజుతో జరిగిన అత్యంత భారీ బిజినెస్ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ 43 కోట్లకు అమ్మడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్ బాగుపడాలి అంటే కనీసం 4 మిలియన్ డాలర్లు రావాలి. దీనితో ఈ మూవీ ఓవర్సీస్ బయ్యర్ కు భారీ నష్టాలు వస్తున్న పరిస్థితులలో అతడు నష్టాలు నుండి తనను కాపాడమని ఈ మూవీ నిర్మాతల వైపు చూస్తున్నట్లు టాక్. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 360 కోట్లు కలక్షన్స్ తెచ్చుకుని కూడ భయంకరమైన ఫ్లాప్ గా మారడం ఒక ఊహించని ఇండస్ట్రీ రికార్డ్. ఈ మూవీ బాలీవుడ్ లో 100 కోట్ల నెట్ కలక్షన్స్ తెచ్చు కావడంతో అక్కడ బయ్యర్ల పరిస్థితి ఫర్వాలేదు కానీ ప్రభాస్ పుట్టి పెరిగిన తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ బయ్యర్లకు సుమారు 80 కోట్ల దాకా నష్టాలు రావడం ఖాయం అని అంటున్నారు. 

ఈ రోజు నుండి ‘సాహో ప్రదర్శించే ధియేటర్లలో కనీసం కరెంట్ ఖర్చులు కూడ రావు అన్న టాక్ వినిపిస్తోంది. నిన్నఆదివారం షోల‌న్నీ అయ్యేస‌రికి వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ 200 కోట్ల‌కు అటు ఇటుగా కలెక్షన్స్ వచ్చినా ఒక్క హిందీ వెర్ష‌న్ మిన‌హాయిస్తే అన్నిచోట్ల భారీ నష్టాలు రాబోతున్నాయి. దీనితో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ‘అజ్ఞాతవాసి’ పేరిట ఉన్న 60 కోట్ల భారీ లాస్ రికార్డును ‘సాహో’ బ్రేక్ చేసింది జోక్స్ వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: