సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో జీవితానికి సంబంధించైనా బోలెడన్ని గాసిప్స్ ఉండటం చాలా కామన్. సినిమా సెలబ్రిటీస్ మీద ఎప్పటికప్పుడు డేటింగ్ అంటు చాలానే రూమర్స్ వస్తుంటాయి. ఈ విషయంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ మీద నాలుగు గాసిప్స్ ఎక్కువగానే వస్తుంటాయి. అయితే మొదటిసారి తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని బయటపెట్టాడు ఈ మెగా హీరో. తన ప్రేమ..పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింని షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పాడు.. "నా జీవితంలో కూడా లవ్ స్టోరీ ఉంది. ఓ అమ్మాయిని ప్రేమించాను... తను నా కాలేజ్ ఫ్రెండ్. 

ఇండస్ట్రీతో తనకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. కెరీర్ లో ఇంకా సెటిల్ అవ్వని టైమ్ లోనే మా లవ్ బ్రేకప్ అయింది. అంతేకాదు ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. నా కాలేజ్ లైఫ్ తర్వాత ఫిలిం కెరీర్ స్టార్ట్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో మేం విడిపోయాం. అప్పటికి ఇంకా నా మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు." అంటు తన పర్సనల్ విషయాలని బయట పెట్టాడు. ఇక పుకార్ల విషయానికొస్తే, హీరోయిన్లతో క్లోజ్ గా ఉండడం తన నైజమని, మా సినిమా వాళ్ళ మీద పుకార్లు రావడం సహజమని అంటున్నాడు. ప్రస్తుతానికి తను సింగిల్ గా ఉన్నానని, ఆ స్టేటస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. 

అంతేకాదు "నా హీరోయిన్లతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను. కేవలం వాళ్లు నా హీరోయిన్స్ అని కాదు, నాకు మంచి ఫ్రెండ్స్ కూడా. నేను, రాశి, రెజీనా, రకుల్ మేమంతా చాలా క్లోజ్. అది చూసి మా మధ్య ఏదో ఉందని చాలామంది అనుకున్నారు. దీనికితోడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేశామంటే ఈ పుకారు ఇంకా పెద్దదైపోతుంది. నన్ను సింగిల్ గా మాత్రం ఉండనివ్వట్లేదు అంటు హీరోయిన్స్ విషయంలో తన మీద వస్తున్న గాసిప్స్ కి తెలివిగా క్లారిటి ఇచ్చాడు.

ఇక తన పెళ్లికి సంబంధించి ఇంట్లో చర్చలు జరుగుతున్నాయని స్పష్టంచేసిన సాయి ధరమ్ తేజ్... తనింకా కెరీర్ లో సెటిల్ అవ్వలేదనే విషయం అమ్మకు బాగా తెలుసంటున్నాడు. కెరీర్ లో నిలదొక్కుకున్న వెంటనే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. మరి హీరోగా సినిమాలు చేస్తున్న ఈ మెగా హీరో నే ఇలా అంటే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ 30 ఏళ్ళు దాటినా సరైన జీతం లేని వాళ్ళు ఏమనాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: