టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం టైం బ్యాడ్ నడుస్తుందని చెప్పొచ్చు. చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ వరుసగా స్టార్ ఛాన్సులు అందుకునేలా క్రేజ్ సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని రకుల్ రీసెంట్ గా కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2లో నటించింది.


బాలీవుడ్ లో కూడా దేదే ప్యార్ దే సినిమాతో హిట్ అందుకున్న రకుల్ అక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఈమధ్య టాలీవుడ్ లో ఫీమేల్ లీడ్ సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. అందుకే రకుల్ కూడా ఇక మీదట అలాంటి సినిమాలను చేయాలని చూస్తుందట. తన క్లోజ్ సర్కిల్స్ లో ఉన్న డైరక్టర్స్ కు లేడీ ఓరియెంటెడ్ కథ ఉంటే చెప్పమని అంటుందట.      


అందం అభినయం రెండు కలిసి ఉండే ఈ అమ్మడికి సరైన ఛాన్స్ రావట్లేదు. మన్మథుడు 2 ఫ్లాప్ తో రకుల్ టాలీవుడ్ కెరియర్ మళ్లీ ప్రశ్నార్ధకంగా మారింది. అటు కోలీవుడ్ లో కూడా పరిస్థితి ఇలానే ఉందట. అందుకే ఇక ప్రయోగాలు చేసేనందుకు సై అంటుంది రకుల్. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఫీమేల్ లీడ్ మూవీస్ చేస్తున్న భామలు ఉన్నారు.


వారితో పాటు రకుల్ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. అయితే అలాంటి కథను రకుల్ కు చెప్పి ఒప్పించే టాలెంట్ ఎవరికి ఉంది. అందుకే అలాంటి కథలు తాను చేసేందుకు రెడీ అంటుందని రకుల్ అందరి దగ్గర ప్రస్థావిస్తుందట. ఎవరో ఒకరు తనకు సరైన కథ తీసుకురాకపోతారా అని అమ్మడి నమ్మకం కాబోలు. మరి రకుల్ చేసే ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: