తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, కిషన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


చిరంజీవి మాట్లాడుతూ... ఆయ‌న‌కు మేనేజ‌ర్ల విలువ బాగా తెలుస‌న్నారు. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రధతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చాము అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో గౌరవ అద్యేక్షులు: ఎమ్.సీతారామరాజు, ప్రెసిడెంట్: అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, వైస్ ప్రెసిడెంట్: డి.యోగనంద్,  వైస్ ప్రెసిడెంట్: కుంపట్ల రాంబాబు, జాయింట్ సెక్రటరీ: సురపనేని కిషోర్, జాయింట్ సేకరిట్రీ: జి.నాగేశ్వర రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: