సినీ ఇండ‌స్ట్రీలో హీరో హీరోయిన్లు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాక కొన్ని సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. కొంత మంది యాడ్స్ చేస్తారు. మ‌రికొంత మంది కొన్ని ప్రాడ‌క్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా బ్రాండ్ ఎంబాసిడ‌ర్‌గా ఉండ‌డం చాలా ఫ్యాష‌న్ అయిపోయింది.  ఇప్పుడు @MebazWorld కి ఆన్‌లైన్ షాపింగ్‌కి వీళ్ళు బ్రాండ్ ఎంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాళ్ళు ఎవ‌రా అనుకుంటున్నారా ఎవ‌రో కాదండీ క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ, క్యూట్ కియారా అద్వాని దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ముంబ‌యిలో ఆ యాడ్ కి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారు. వీరిద్ద‌రూ క‌లిసి ఆ యాడ్‌లో న‌టించారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎక్కువ‌గా మ‌న‌కు శారీస్, డ్ర‌సెస్‌, కుర్తాస్‌, ఇంకా లేడీస్ అండ్ జంట్స్ కి సంబంధించిన అన్ని ర‌కాల ఫ్యాష‌న్ డ్ర‌స్సులు దొరుకుతాయి. 


గ‌తంలో తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్  సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. చీరల అమ్మకాలు పెంచేందుకు గానూ తీసుకు రావలిసిన  కొత్త ఆలోచనలు తనకు ఉన్నాయని వీవర్స్ తో కలిసి తానూ ఆ పద్దతులను ఆచరణ లోకి తెస్తానని చెప్పింది సమంత. తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహరించాల్సిందిగా మంత్రి  కేటీర్ కోరటంతో తన అంగీకారం చెప్పింది సమంత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ని ఏపీ టూరిజం అంబాసిడర్ గా కానీ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా కానీ నియమించే ఆలోచనలో ఉన్నారని వార్త హల్చల్ చేస్తుంది.


కాగా అందుకు సంబందించిన చర్చలు కూడా ముగిశాయని, ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఎన్టీఆర్ తో చర్చలు జరిపాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ పై ఇలాంటి ప్రచారాలు గతంలో కూడా బాగానే జరిగాయని, మధ్యపాన నిషేధానికి ఎంబాసిడర్ గా నియమిస్తారని అన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: