ప్లాపులతో సతమతం అవుతున్న స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కి ఒక బంపర్ ఆఫర్ లా హిట్ హీరో అయినా రామ్ తో ఒక సినిమా పట్టాలెక్కబోతోంది అన్న వార్త  ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించాలని ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే కానీ వినాయక్ కి కొన్ని పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదు.


మొత్తం అయిపోయింది అనుకున్న కూడా కథ కుదరక వినాయక్ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంకొక సినిమా తమిళంలో హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద‌’ తెలుగులో వెంకటేష్ – నారా రోహిత్ కాంబినేషన్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవ్వబోతుందన్నా వార్త కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. కానీ అవి కూడా కేవలం రూమర్స్  అని తేలిపోయాయి.



మళ్ళీ వినాయక్ నుండి ఇప్పుడు మళ్లీ ఇంకో సరికొత్త అప్ డేట్ వచ్చింది. ఇటివలే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి సూపర్ హిట్‌ అందుకున్న రామ్‌ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అని ఒక వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌ లా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని,  త్వరలోనే ఈ  సినిమాను వారు పట్టాలేక్కించబోతున్నారు.


ఇక రామ్ ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిన వార్తనే. కానీ కిశోర్‌ తిరుమల సినిమా చేసిన తరువాతే  ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.  వి.వి వినాయక్ రామ్ తో చేయబోయే ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కి ప్లాప్ డైరెక్టర్ అనే  టాగ్ ని  తొలగించుకుంటారేమో చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: