టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’ సినిమతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  మొదటి సినిమాతోనే మాస్ లుక్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా విజయాన్ని అందుకోలేదు.  దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘చత్రపతి’ ప్రభాస్ జాతకాన్ని మొత్తం మార్చింది.  అదృష్టం కొద్ది తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి.  మిర్చి సినిమా తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి, బాహుబలి 2’ జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి.   

ఈ నేపథ్యంలో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది... జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 'బాహుబలి2' తరువాత ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ‘సాహూ’.  సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కి ముందు భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.  తెలుగు, కన్నడ,మళియాళ, హిందీ భాషల్లో ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ చేశారు.  అయితే ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. 

సినిమా ఎంతో రిచ్ గా ఉన్నా..సరైన కథా బలం లేకపోవడంతో తేలిపోయింది. కానీ జాతీయ స్థాయిలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో వసూళ్ల పరంగా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లు చేస్తుంది.  అంతే కాదు 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పెంచుకున్న క్రేజ్, వసూళ్ల పరంగా ఈ సినిమాకి కలిసొచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించిన 'సాహో' .. 10 రోజుల్లో 400 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది.  లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తదుపరి సినిమాగా 'జాన్' రూపొందుతోన్న సంగతి తెలిసందే.


మరింత సమాచారం తెలుసుకోండి: