నేను అడిగినంత డబ్బిస్తే ఆమెతో ప్రేమలో ఉన్నానో లేదో చెప్తాను అని అంటున్నాడు బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్. తూనీగ తూనీగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా రియా చక్రబోర్తితో డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆలా వార్తలు వచ్చేలానే తిరుగుతున్నారు లెండి. ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్లడం, చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో వార్తలు వచ్చాయి.     


అయితే ఈ విషయంపై మీడియా వర్గాలు సుశాంత్ సింగ్ ని ఎన్నిసార్లు ప్రశ్నించిన ఏమి లేదు అని చెప్పేవారు కానీ తాజాగా ఈ ప్రేమ వ్యవహారంపై నోరు విప్పారు. ''మీరు సింగలా' అని ఓ విలేకరి ప్రశ్న వేస్తే అందరికి పెద్ద షాక్ ఏ ఇచ్చాడు సుశాంత్. అంత షాక్ కి గురి చేసే సమాధానం సుశాంత్ ఎం చెప్పాడు అని అనుకుంటున్నారా ? 


అదేనండి అతను ఎలా హీరో అయ్యాడో.. ఎందుకు అయ్యాడో చెప్పాడు. ''సుశాంత్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివాడని, ఆతరవాత హీరో అయ్యాడని.. అదంతా అతని అదృష్టం వాళ్ళ జరగలేదని.. అతను ఆలా ప్లాన్ చేసుకున్నాడు కాబట్టే హీరో అయ్యాడని చెప్పాడు. ఆలా చెప్తూనే .. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై సమాధానం ఇవ్వాలంటే అతను చాల డబ్బు తీసుకుంటాడని అతను వెల్లడించాడు. 


అతనికి ఓ పెద్ద పేరున్న మ్యాగజైన్‌పై అతని ఫొటోతో పాటు డబ్బు కూడా కావాలని, అవి ఇస్తేనే అతను డేటింగ్‌లో ఉన్నదో లేదో చెప్తానని వ్యాఖ్యానించాడు. కాగా ఇప్పుడు రియా చక్రబోర్తితో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు ఎలా వస్తున్నాయో గతంలోను అంకితా అనే బుల్లితెర నటితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి 'పవిత్ర రిష్తా' అనే సీరియల్ లో కలిసి నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: