యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ పరంగా ఆయన కొంత ఆలోచనలో పడ్డారు. అందుకే తదుపరి చేయబోయే సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకున్న గోపీచంద్, ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ చాణక్య. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తుండగా, ఈ సినిమాలో మెహ్రీన్ మరియు జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎక్కువ శాతం ఇండియా, 

పాకిస్థాన్ బోర్డర్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మొన్న వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ లో 'మనం రెండు లైఫ్స్ లీడ్ చేస్తున్నాం, ఒకటి అబద్దం, రెండవది నిజం', 'నువ్వు ఏదైతే దమ్ము అనుకుంటున్నావో దాన్ని బయటకు తీసి చంపుతా' అంటూ  గోపీచంద్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ టీజర్ లో అదిరిపోయాయి అనే చెప్పాలి. థ్రిల్లింగ్ కలిగించే యాక్షన్, 

ఛేజింగ్ సీన్స్ తో సాగిన ఈ టీజర్ ను బట్టి గోపీచంద్ ఇందులో రా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు కొంత అర్ధం అవుతుంది. ఇక టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా, ఎడిటింగ్ ని మార్తాండ్ కె వెంకటేష్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా గోపీచంద్ కు ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో వేచి చూడాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: