టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కన్నడ హీరోలు నటించారు.  వారిలో కొద్ది మంది మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నారు.  పాత తరం నటుల్లో రాజ్ కుమార్ తర్వాత విష్ణువర్థన్ ఆ తర్వాత ఉపేంద్ర ఇలా కన్నడ హీరోలు తెలుగు లో తమ టాలెంట్ చాటుకున్నారు.  ఇక  'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుదీప్ చేరువయ్యాడు. కన్నడలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతోన్న ఆయన, తెలుగులో ముఖ్యమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నాడు.  సుదీప్ , మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీలోనటిస్తున్నాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎన్నో ఆసక్తికర అంశాలు పాలు పంచుకున్నారు.

ప్రస్తుతం తాను తెలుగు ప్రేక్షకుల ముందుకు  'పహిల్వాన్' మూవీతో వస్తున్నానని అన్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయనకి 'సైరా' సినిమా గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'సైరా'లో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. చిరంజీవి వంటి గొప్ప నటుడు 'సైరా' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం చేయవలసిందే. ఈ సినిమాను చిరంజీవి తనయుడే నిర్మించడం మరో విశేషం.

ఈ సినిమాలో నేను 'అవుకు రాజు' పాత్రను పోషించాను. ఇది చాలా మంచి పాత్ర .. అందువలన ఏ ఆర్టిస్ట్ చేసినా బాగానే ఉంటుంది.  గతంలో బాహుబలి మూవీలో తనకు మంచి ప్రాధాన్యత గల పాత్ర దక్కిందని..ఈసారి కూడా సైరాలో మరో మంచి ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తున్నానని అన్నారు.  చిరంజీవి పక్కన నిలబడితే చాలని అనుకున్న నాకు, ఆయనతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో కలిసి నటించిన ప్రతి నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది  అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: