నేచురల్‌ స్టార్‌ నాని,   డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌  నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో  చిత్రబృందం  ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. కాగా తాజాగా నాని ప్రీ రిలీజ్ ప్రమోషన్ లో  భాగంగా  గుంటూరులోని  'వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' కాలేజీని సందర్శించారు. అక్కడ స్టూడెంట్స్ తో ముచ్చటించిన నాని... సినిమా గురించి.. అలాగే సినిమాలోని ఫన్ గురించి చెప్పి.. తప్పకుండా అందరూ తమ సినిమాని మొదటి రోజే  మొదటి షో చూడాలని కోరారు. మొత్తానికి నానితో సెల్ఫీ దిగటానికి అక్కడి స్టూడెంట్స్ పోటీ పడ్డారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లతో పాటుగా టీజర్ ట్రైలర్లకు కూడా విశేష స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాకి నుండి వచ్చిన  'నిన్ను చూసే  ఆనందంలో'  లిరికల్ సాంగ్ కూడా  నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.  కాగా  ఈ సినిమా అవుట్ ఫుట్  చాలా బాగా వచ్చిందట.   సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.  ముఖ్యంగా  ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. నాని క్యారెక్టర్ చుట్టూ ఉండే పాత్రల ప్రభావం వల్ల, తెలియకుండానే నాని చేసే యాక్టివిటీస్ అలాగే   కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయట. 


ఇక ఈ సినిమాలో  నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అయితే  'గ్యాంగ్ లీడర్' అంటేనే పక్కా మాస్ టైటిల్.  తెలుగు రాష్ట్రాల వరకూ ఈ టైటిల్ బాగానే ఉంటుంది గాని, ఓవర్సీస్ లో ఈ టైటిల్ ఎంతవరకూ  వర్కౌట్ అవుతుందనేది చూడాలి.  కాగా హీరోయిన్ గా నటిస్తోన్న  చెన్నై బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి.  అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న  'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో ఎలా మేపిస్తాడో..? ఇక ఇతర కీలక పాత్రల్లో  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య  నటిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.  అయితే  సెప్టెంబర్ 13న సూర్య బందోబస్త్  కూడా రిలీజ్ కాబోతుంది.  మరి   'గ్యాంగ్ లీడర్'  'బందోబస్త్' చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద  ఏది ముందడుగులో ఉంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: