Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 6:35 pm IST

Menu &Sections

Search

తన చేతిపై ఉన్న ‘టాటూ’ అర్థం చెప్పేసిన ‘నాగార్జున’

తన చేతిపై ఉన్న ‘టాటూ’ అర్థం చెప్పేసిన ‘నాగార్జున’
తన చేతిపై ఉన్న ‘టాటూ’ అర్థం చెప్పేసిన ‘నాగార్జున’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కింగ్ నాగార్జున ట్రెండ్ కి తగ్గట్లు తనను తాను మలుచుకుంటూ ఉంటాడు. ఇటీవల 'మన్మథుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్ ప్రస్తుతం 'బిగ్ బాస్ 3'కి హోస్తుగా నిర్వహిస్తున్నారు. గతంలో మీలో ఎవరు కోటిశ్వరుడు  ప్రోగ్రాం చేసిన అనుభవం ఉండటంతో బిగ్ బాస్ -3 షోకు వ్యాఖ్యతగా ఎంపిక చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. నవ్వుతూ తనదైన శైలితో బిగ్ బాస్ హోస్టుగా చేస్తున్నారు. అయితే ఆదివారం నాడు ప్రసారమైన బిగ్ బాస్ షోలో నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ క్రమంలో నాగార్జున చేతిపై ఉన్న టాటూ ఒక్కసారి  చూపించాలని, అయితే ఈ టాటూ ఎందుకు వేసుకున్నారో చెప్పాల్సిందేనని నాని కోరారు. హౌస్ మేట్స్ కూడా అడగడంతో నాగార్జున తన ఎడమ చేతిపై వేసుకున్న టాటూ గురించి వివరించారు. చేతిపై టాటూ దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూని చూపిస్తూ దానికి వివ‌ర‌ణ ఇచ్చారు.

 

''నాగుపాము కుబుసాన్ని విడిచిపెడుతుంది. నేను కూడా గతాన్ని గురించి అసలు పట్టించుకోను. ఏమి ఆలోచించను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుక్కుంటూ  ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్(దిక్సూచి)పైన ఉన్న 'ఎన్' అనే అక్షరం ఉత్తర దిక్కు కావొచ్చు లేదా నా పేరు కూడా కావొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీనర్ధం'' అంటూ చెప్పారు నాగార్జున.

 

ఇక ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిననాని తన 'గ్యాంగ్ లీడర్' సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన నాని…ఆ సినిమా టీజర్ ను బిగ్ బాస్ కంటెస్టంట్ కు చూయించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Bigg Boss Telugu 3: All you need to know about host Nagarjuna Akkineni’s new tattoo
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.