సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇష్టమైన శిష్యుడుగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకుడిగా మారి ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తెరకెక్కించాడు.  ఈ మూవీలో హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ తొలిపరిచయం అయ్యారు.  మొదట ఈ మూవీ పై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  పోస్టర్స్, టీజర్ చూసి ఈ మూవీ బోల్డ్ మూవీ అని వల్గర్ మూవీ అని కామెంట్స్ వచ్చాయి. 

ఇక థియేటర్లో రిలీజ్ అయిన వారం రోజుల వరకు ఇలాంటి టాక్ వచ్చిన మంచి లవ్ స్టోరీ ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.  దాంతో ఈ మూవీ మంచి సక్సెస్ అందుకోవడమే కాదు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వసూళ్లు చేసింది. ఈ మూవీ తర్వాత కార్తికేయకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఈ మద్య గుణ 369 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  తాజాగా శేఖర్ రెడ్డి దర్శకత్వం  అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్న '90 ML' సినిమా రూపొందుతోంది.  ఈ మూవీలో కార్తికేయ డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడట. 


టైటిల్ కి తగినట్టుగానే మత్తు పానీయాల సీసాలపై కాలుమీద కాలేసుకుని పడుకున్న కార్తికేయ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే కార్తికేయ బాటిల్స్ మద్య పడుకోవడం కనిపిస్తుంది..అలాగే చాలా హ్యపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనే విషయం అర్థమవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక కార్తికేయ విలన్ గా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: