కింగ్ నాగార్జున ప్రస్తుతం రియాల్టీ షో బిగ్ బాస్ 3 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో లో అతిథిగా నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. నాగార్జున చేతిపై ఓ కొత్త ట్యాటూ వేయించుకున్నారని అది ఎవరికీ కనిపించకుండా దాచి పెడుతున్నారని అన్నారు. ఇక హౌస్ మేట్స్ అడగటంతో నాగార్జున తన ఎడమ చేతిపై ఉన్న దిక్సూచి నాగుపాము కాంబినేషన్ లో ఉన్న ట్యాటూను చూపిస్తూ దానికి వివరణ ఇచ్చారు. నాగు పామును చూస్తూంటే అందరికీ అర్థమవుతుంది అది కంపాస్, దిక్సూచిలో కన్ను నాదే అంటే నేను ఎప్పుడూ కొత్త విషయాలను వెతుకుతూ ఉంటానని అర్థం. అలాగే దిక్సూచిలో కనపడుతున్న అక్షరం ఎన్ ఉత్తర దిక్కు లేదా నా పేరు నాగార్జున అని సూచిస్తోంది.



ఇక ట్యాటూ లోని పాము దగ్గరున్న చుక్కలకు అర్థం నాగు పాము కుబుసాన్ని  విడిచిపెట్టినట్లు తాను కూడా గతాన్ని మరచిపోయి కొత్త విషయాలను అన్వేషిస్తూంటాను అని అర్థం అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ లో ఆయన తాజా తంత్రం ఇలా ఉంది. బిగ్ బాస్ సీజన్ త్రీ కి చెందిన మేటర్ ఈ సీజన్ నుంచి వారం రోజుల పాటు దూరంగా జరిగాడు నాగార్జున. తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి స్పెయిన్ వెళ్లాడు. అలా ఫుల్ గా ఎంజాయ్ చేసిన నాగ్ ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సెట్స్ పైకి వచ్చేశాడు. వస్తూ వస్తూనే సభ్యుల్లో కొందరికి క్లాస్ పీకాడు. తను స్పెయిన్ లో ఉన్నప్పటికీ బిగ్ బాస్ కార్యక్రమాన్ని నాగార్జున ఫాలో అయ్యాడు అనే విషయం నిన్న అతడి మాటల్లోనే అర్థమైంది.



గత సీజన్ లకు భిన్నంగా ఈ సారి బిగ్ బాస్ హౌజ్ ఎవరి గోల వారిది అన్నట్టుగా మారుతోంది. ఏ ఇద్దరూ కలిసి వుండటం లేదు. ఉన్నంతలో పునర్నవి, రాహుల్ కాస్త క్లోజ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వీళ్లు కూడా ఎప్పుడూ మారిపోతారో ఎవ్వరికీ అంతు చిక్కకుండా ఉంది. ఈ సంగతి పక్కన పెడితే నాగార్జున రీ ఎంట్రీ తో ఈ సారి ఎలిమినేషన్ పై మరోసారి అందరి దృష్టి పడింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఐదుగురినీ పక్కనబెట్టారు. రాహుల్, శ్రీముఖి, మహేష్, రవికృష్ణ, అలిరెజాను ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టారు.వీళ్ళల్లో ఒక్కరుని నాగార్జున సేవ్ చేశారు.



ఎపిసోడ్ క్లోజింగ్ టైమ్ కి రాహుల్ ని నాగార్జున సేవ్ చేశాడు. రాహుల్ బయటపడటంతో ఇక మిగిలిన నలుగురిపై అందరి దృష్టీ పడింది. అయితే ఈ నలుగురు నుంచి అలిరెజా బయటకు వెళ్లటం ఖాయమంటోంది సోషల్ మీడియా. బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లీక్ లు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఒక రోజు ముందే బయటకు వచ్చేస్తుంది. ఇప్పటి వరకూ వచ్చిన లీకులన్నీ నిజమయ్యాయి. నిన్నటి నుంచి అలిరెజా పేరు గట్టిగా వినిపిస్తోంది. కనుక ఈ సారి ఇతడు బయటకు వెళ్లిపోవచ్చని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: