టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎదో ఒక తెలుగు సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 2006లో పోకిరి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ ని కూడా షాక్ అయ్యేలా చేసింది. ఇక తాజాగా విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను అందుకుంది. 2006 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది అత్యధిక షేర్స్ అందించిన కొన్ని సినిమాలని ఇప్పుడు చూద్దాం...   

2006లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహేష్ బాబు  పోకిరి 41.2కోట్ల షేర్స్ ని రాబట్టి , ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మహేష్ కెరియర్ కి బిగెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.. ఆ తరువాత యమ దొంగ 2007 లో ఎస్ ఎస్  రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 30.1కోట్లను రాబట్టింది. తారక్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆ తరువాత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్  లో వచ్చిన జల్సా  29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది. 
2009 మగధీర...  అప్పట్లో సౌత్ ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన మగధీర 76కోట్లకు పైగా లాభాలని రాబట్టింది. ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి  తెరకెక్కించారు. రామ్ చరణ్ కి స్టార్ స్టేటస్ అందించిన చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక  2010 బాలకృష్ణ చాలా ప్లాప్స్ తరువాత బోయపాటి డైరెక్షన్ లో చేసిన సింహా సినిమా ఊహించని విధంగా 31.3కోట్ల లాభాల్ని అందించింది. బాలయ్య బౌన్స్ బ్యాక్ ఫిలిం గా చరిత్ర సృష్టించింది. 

2011లో  మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దూకుడు. ఈ సినిమా 57.8కోట్ల లాభాలని రాబట్టింది. 2012, ఎన్నో అపజయాల అనంతరం గబ్బర్ సింగ్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా 62.5కోట్ల షేర్స్ ని రాబట్టింది. 2013: అత్తారింటికి దారేది: త్రివిక్రమ్ డైరెక్షన్ లోప్ రెండవసారి పవర్ స్టార్ చేసిన చిత్రమిది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 76.8కోట్లను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2014: రేసుగుర్రం: అల్లు అర్జున్ తన కెరీర్ లోనే ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ ఏడాది అత్యధికంగా ఈ సినిమా 59.8కోట్లను రాబట్టింది. దర్శకుడు సురేందర్ రెడ్డి.

2015..బాహుబలి: ఈ సినిమాతో రాజమౌళి ప్రభాస్ రేంజ్ ను మరో స్థాయికి పెంచాడు. తెలుగులోనే 191కోట్ల షేర్స్ ని అందించిన ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 311కోట్లను రాబట్టింది. 2016:జనతా గ్యారేజ్: కొరటాల శివ డైరెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 80.1కోట్ల షేర్స్ ని రాబట్టింది. 2017..బాహుబలి 2: ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డునే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యధికంగా 865.1 కోట్ల షేర్స్ ని అందించింది.
2018.. రంగస్థలం కలెక్షన్స్ తోనే కాకుండా నటుడిగా కూడా రామ్ చరణ్ ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 125.2కోట్ల లాభాల్ని అందించింది. 2019.. సాహో: సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. వరల్డ్ వైడ్ గా 400కోట్లకు పైగా ఈ సినిమా షేర్స్ ని అందించినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: