Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 7:09 pm IST

Menu &Sections

Search

వ‌రుణ్ వ‌య‌సుకు మించిన క్యారెక్ట‌ర్ చేశాడంటున్న ద‌ర్శ‌కుడు

వ‌రుణ్ వ‌య‌సుకు మించిన క్యారెక్ట‌ర్ చేశాడంటున్న ద‌ర్శ‌కుడు
వ‌రుణ్ వ‌య‌సుకు మించిన క్యారెక్ట‌ర్ చేశాడంటున్న ద‌ర్శ‌కుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..',
'మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే.. ఇగ బతుకుడెందుకురా..'
'జిందగీ మాదర్‌చోద్‌ తమ్మీ... ఉత్త గీతలే మన చేతులుంటయ్‌, రాతలు మన చేతులుండయ్‌'
'గవాస్కర్‌ సిక్స్‌ కొట్టుడు, బప్పీలహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు.. సేమ్‌ టు సేమ్‌.. అదే ప్యాసన్‌'


...ఇవీ వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్మీకి' చిత్రంలోని పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్స్‌. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోమవారం విడుదలైన ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రంలో వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ చెప్పే డైలాగ్స్‌కి థియేటర్‌లో విజిల్స్‌, క్లాప్స్‌ ఖాయమని డైలాగ్స్‌ వింటే అర్థమవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..


చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ - ''ఇటీవల విడుదల చేసిన మా వాల్మీకి టీజర్‌కిమంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కి అంతకు మించి రెస్పాన్స్‌ వస్తుంది అని నమ్ముతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జె.మేయర్‌ మాట్లాడుతూ - ''ఇలాంటి ఒక విభిన్న తరహా చిత్రానికి నాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్‌ గట్స్‌ ని ముందుగా అభినందిస్తున్నాను. నేను ఇప్పటివరకు మెలోడీ, క్లాసిక్‌ మ్యూజిక్‌నే ఇచ్చాను. ఇలాంటి ఒక మాస్‌ సినిమాకు వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన వరుణ్‌, ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంటకి థాంక్స్‌. ఇప్పటికే విడుదలైన అన్ని సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వాల్మీకి చిత్రం నాకు ఒక కంప్లీట్‌ చేంజ్‌ ఓవర్‌ లాంటిది. అలాగే వరుణ్‌ ఈ చిత్రంలో తన బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. అలాగే ఐనాంక బోస్‌ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం జరగడానికి కారణమైన నిర్మాతలు రామ్‌ఆచంట, గోపిఆచంట గారికి ముందుగా థాంక్స్‌. జిగర్తాండ సినిమా వరుణ్‌తో చేస్తున్నాం..అన్నప్పుడు వరుణ్‌ ఏ క్యారెక్టర్‌ చేస్తాడు అని కూడా అడగకుండా వెంటనే రైట్స్‌ తీసుకున్నారు. నేనంటే వాళ్లకు అంత నమ్మకం. నేను సినిమాను ఎలా చూశానో వరుణ్‌ కూడా అలానే చూశారు. ఈ చిత్రంలో తన వయసుకు మించిన క్యారెక్టర్‌ చేశారు. ఆయన గట్స్‌కి నిజంగా హ్యాట్సాఫ్‌. మిక్కీ నేను సుబ్రహ్మణ్యంఫర్‌సేల్‌ సినిమాలో కలిసి పనిచేశాం. ఆ తరువాత మహానటి నాకు బాగా నచ్చింది. అతనితో కలిసి ట్రావెల్‌ అవుతుంటే తనుఎంత మంచి మ్యూజిక్‌ ఇవ్వగలడు అనేది తెలుస్తుంది. తనకి ఎంత గొప్ప కంటెంట్‌ ఉన్న మూవీ ఇస్తే అంత గొప్పగా మ్యూజిక్‌ చేయగలరు. ఈ సినిమా ప్రీ టీజర్‌ తరువాత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. దాని టీజర్‌ బ్యాలన్స్‌ చేసింది. టీజర్‌తో ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి దాన్ని తప్పకుండా ట్రైలర్‌ బ్యాలన్స్‌ చేస్తుంది. జిగర్తాండలో వరుణ్‌ చేసిన క్యారెక్టర్‌ తమిళ నటుడు బాబీసిన్హా చేశారు. ఆయనకు అది నేషనల్‌ అవార్డు తెచ్చింది. ఆ క్యారెక్టర్‌ వరుణ్‌కి కూడా మంచి పేరు తెస్తుంది. తమిళ మాతృకలో చిన్న చిన్న చేంజెస్‌ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. ప్రతి బోయ సంగం వాళ్లు, ప్రతి వాల్మీకి అభిమాని గర్వపడేలా సినిమా ఉంటుంది'' అన్నారు. అప్పుడ‌ప్పుడు వ‌రుణ్‌ని చూస్తే జాలేసేది పాపం ఆ హెయిర్‌స్టైల్‌తో చాలా ఇబ్బంది ప‌డ్డాడు అని అన్నారు.


మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''ఈ క్యారెక్టర్‌ చేస్తున్నాను అని తెలియగానే నా చుట్టూ కొంత నెగటివిటి ఏర్పడినా ఈ క్యారెక్టర్‌ చేయగలను అన్న కాన్ఫిడెంట్‌ని ఇచ్చింది మా దర్శకుడు హరీష్‌ గారు. చాలా మంచి కథలు ఉన్న కొన్ని మాత్రమే రీమేక్‌ చేయాలని అనిపిస్తాయి. అలాంటి కథే జిగర్తాండ. సినిమా ఇండస్ట్రీ గొప్పతన్నాని కూడా చెప్పే చిత్రం ఇది. నా లుక్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కి కూడా ఇంకా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. నటుడిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ఇలాంటి క్యారెక్టర్స్‌ ఎంతో అవసరం. మొదట్లో హరీష్‌ ఎనర్జీని బ్యాలన్స్‌ చేయడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. తరువాత అలవాటు అయింది. సెప్టెంబర్‌ 20 మీ ముందుకు వస్తున్నాం. వాల్మీకి తప్పకుండా మీ అందరికి నచ్చే చిత్రం అవుతుంది'' అన్నారు


varun vayasuku minchina charecter chesadantunna darsakudu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు బ‌యోపిక్‌లో రామ‌చ‌ర‌ణా..? వ‌రుణ్‌తేజా..?
చంద‌మామ తాజ్ మ‌హ‌ల్‌కి వెళ్ళిందా... ఎందుకు?
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో క‌మ‌ల్‌హాస‌న్‌....?
శోభ‌న్‌బాబు షూతో వ‌రుణ్ డ్యాన్స్‌
'దేవత'చిత్రంతో 'వాల్మీకి' ని పోల్చిన ద‌ర్శ‌కుడు
చ‌ల‌ప‌తిరావుకి ఒక దశలో చచ్చిపోవాలనిపించిందంట‌...?
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.