ఇప్పటివరకు టాలీవుడ్ కి మిగతా సినిమా ఇండస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉండేది. పురాణాలను కళ్లకు కట్టినట్టు చూపించే…సినిమాల్లో అసభ్య పదజాలం తక్కువగా వాడే ఇండస్ట్రీ గా మనకు చాలా పేరుంది. అయితే ఇదంతా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గా మారక ముందు మాట. అతను ఎప్పుడైతే "ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్***. అన్నాడో ఆ రోజు నుంచి టాలీవుడ్ షేప్ మారిపోయింది. అతనిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గాని ఇప్పుడు వస్తున్న చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలన్నింటిలో బూతు పదాలు చాలా కామన్ అయిపోయాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోలు కూడా తమ సినిమాల్లో భూతులను అవలీలగా పలికేస్తున్నారు. మనం చూసినట్లయితే వాల్మీకి ట్రైలర్ లో వరుణ్ తేజ్ "జిందగీ మాదర్*** తమ్మి.... గీతలు మన చేతిలో ఉంటాయి రాతలు మన చేతుల్లో ఉండవు అని అన్నాడు. అలాగే నేడే రిలీజ్ అయిన చాణక్య టీజర్ లో కూడా గోపీచంద్ "గాండ్ మే దమ్ హై తో వహీ రుక్ సాలే… (గు* లో దమ్ముంటే అక్కడే ఉండు రా) అని అంటాడు.ఇస్మార్ట్ శంకర్ లో విలన్ ని కూడా మనం ఇలాగే బూతు మాటలు చాలానే ఉచ్చరించ చూడొచ్చు. ఇక విశ్వక్ సేన్ లాంటి చిన్న హీరోల సంగతి అసలు చెప్పబన్లేదు.

రిలీజ్ కాబోయే సినిమాల్లో ఇలాంటి పదాలను సెన్సార్ బోర్డు కట్ చేసి హాల్ లో మ్యూట్ చేసేలా చేస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడే లిప్ మూవ్మెంట్ ని బట్టి అవి ఏంటో జనాలకు చాలా ఈజీగా అర్థమైపోతుంది.... లేదా ఇప్పటికే అర్థం కాలేదంటే మన యూట్యూబ్ ఉండనే ఉందిగా. దాంట్లో ఎలాంటి సెన్సార్ లేకుండా రిపీట్ లు వేసుకొని మరీ వింటారు. విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్టర్ అనిపించుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఈ రకమైన ట్రెండ్ సెట్టర్ అవుతాడని అనుకోలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: