బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా "RRR" ఈ సినిమాను దాదాపు 400 కోట్లతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు తారక్ లు హీరోలుగా నటిస్తున్నారు.RRR సినిమా ఇద్దరు రియల్ లైఫ్ క్యారక్టర్ ల చూట్టు అల్లిన కల్పిత గాథ.ఇందులో చరణ్ అల్లూరి సీత రామరాజు గా,తారక్ కోమరం భీం గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగాన్ ఇతర  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు వచ్చిన అది వైరల్ గా మారుతుంది.రాజమౌళి  తన సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్ చాలా డిఫరెంట్ గా మరియు కొత్త గా ప్లాన్ చేస్తాడు.తన మొదటి సినిమా నుండి హీరో ఎంట్రి సీన్ తోనే ప్రేక్షకులను సినిమాతో హుక్ చేస్తాడు.ఈ విషయం ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా చూసిన మనకు అర్థం అవుతుంది.


చత్రపతి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ షార్క్ తో  ఉంటుంది.ప్రభాస్ షార్క్ మధ్య జరిగే ఫైట్ వల్ల  మనం సినిమాతో కనెక్ట్ అవుతాం.తెలుగు సినిమా లో షార్క్ తో ఫైట్ పెట్టాడం అదే మొదటిసారి. మగధీర సినిమాలో రామ్ చరణ్ బైక్ జంపింగ్ సిన్ తో  ఎంట్రీ అవుతాడు.బాహుబలి మొదటి భాగంలో ప్రభాస్ జల పాతాన్ని ఎక్కడానికి ట్రై చేసే సీన్ తో ఎంట్రీ అవుతాడు  . రెండవ భాగంలో  ఏనుగు తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఏనుగు వినాయుకుడి విగ్రహన్ని చూసి  నమస్కారించే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.యమదోంగ సినిమాలో పులితో తారక్ ఎంట్రీ  ఉంటుంది.


RRR సినిమాలో  కోమరం భీం పాత్ర  పులి తో  చేసే ఫైట్  తో ఎంట్రీ అవుతాడని . తారక్ మరియు పులి మధ్య ఫైట్ చాలా భీకరంగా ఉంటుందని  ఫిల్మ్ నగర్ నుండి గుసగుసలు వినబడుతున్నాయి. తారక్ ఫస్ట్ లూక్ టీజర్ ని అక్టోబర్ 22 న విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: