బిగ్ బాస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మూడు తప్పులు చేసినట్టుగా తెలుస్తుంది. మొదటగా శివజ్యోతి, శిల్పా చక్రవర్తిని నామినేట్ చేస్తూ నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడమే నేను నామినేట్ చేయడానికి రీజన్ అని అంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది బిగ్ బాస్ ఇష్టం. ఆమెకి ఇష్టం ఉన్నా, లేకపోయినా దాన్ని ఆక్సెప్ట్ చేయాల్సిందే. శిల్పా ని నామినేట్ చేసే హక్కు శివజ్యోతికి ఉంది. కానీ ఆ రీజన్ వైల్డ్ కార్డ్ కాకుండా ఉంటే బాగుండేది.


ఇక రెండోదానికి వస్తే,వితికా, వరుణ్, పునర్నవిలు మహేష్ ని నామినేట్ చేయడం. కెప్టెన్సీ టాస్క్ లో ఆలీ తన మగ్గు విసిరేసాడని మహేష్ టాస్క్ ఆడకుండా వెళ్ళిపోతాడు. ఈ ముగ్గురు ఇదే కారణాన్ని చూపుతూ నామినేత్ చేస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, పునర్నవి టాస్క్ లలో సరిగా పర్ ఫార్మ్ చేసినట్టు కనబడలేదు. వరుణ్ దొంగలు దోచిన నగరం టాస్క్ లో హింస ఎక్కువై పోతుంది నేను ఆడను అని వెళ్తాడు. అలాగే వితికా కూడా టాస్క్ లో వంద శాతం ఎఫర్ట్ పెట్టదు.


టాస్క్ లని సరిగ్గా ఆడని వారే మహేష్ టాస్క్ సరిగా ఆడట్లేదని చెప్పడం వింతగా అనిపించింది.ఇక మూడో దానికి వస్తే, నామినేషన్స్ గురించి ముందుగానే మాట్లాడుకోవడం. అలా మాట్లాడుకుని ఒక అవగాహనకి వచ్చేసి ఒకే రీజన్ తో అందరూ నామినేట్ చేయడం. శిల్పా ని నామినేట్ చేసిన వాళ్ళంతా నాగార్జున గారి ముందు ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదని అన్నారు ఒకే రీజన్ చెప్పారు. అలాగే మహేష్ ని నామినేట్ చేసిన వాళ్ళందరూ ఒకే రీజన్ చెప్పారు.


నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దని బిగ్ బాస్ ఎంత వారించినా ఇంటి సభ్యులు పట్టించుకోవట్లేదు. ఇలా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు మూడు తప్పులు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: