సోమవారం జరిగిన నామినేషన్  ప్రక్రియలో కెప్టెన్ కి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఇచ్చారు.ఎప్పుడూ కెప్టెన్ ని  ఎవరో ఒకరిని నామినేట్ చేయమని చెప్పే బిగ్ బాస్ సేవ్ చేయమని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అయితే కెప్టెన్ గా ఉన్న బాబా భాస్కర్ నామినేషన్స్ లో ఉన్న మహేష్ ని గానీ, శ్రీముఖిని గానీ సేవ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే బాబా భాస్కర్ స్నేహంగా ఉండేది వాళ్ళతోనే కాబట్టి.


కానీ అనూహ్యంగా రవిని సేవ్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీముఖి అయితే షాక్  కొట్టినట్లు మిన్నకుండిపోయింది. మహేష్ తనని సేవ్ చేయడని ముందే ఊహించినట్టున్నాడు. అందుకే పెద్దగా షాక్ అవలేదు. అయితే బాబా భాస్కర్ రవిని చేసి తప్పు చేశాడేమో అనే వాదన వినిపిస్తుంది. మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అతన్ని సేవ్ చేస్తే అందరూ ఏమనుకుంటారోనని పక్కన పెట్టాడు అనుకుంటే, కెప్టెన్సీ టాస్క్ లో తనకి హెల్ప్ చేసిన శిల్పా చక్రవర్తిని మర్చిపోవడం వింతగా అనిపించింది.


హౌస్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన శిల్పాని సేవ్ చేసి ఆమెకి మరింత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే ఇక్కడ బాబా భాస్కర్ క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉన్నాయని తెలుస్తుంది. శిల్పా వచ్చినప్పటి నుండి బాబా భాస్కర్ ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. బాబా కూడా ఆమెకి కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని శిల్పా హౌస్ నుండి వెళ్ళిపోతేనే బాగుంటుందని భావించినట్టున్నాడు.


 
కానీ బాబా భాస్కర్ మహేష్ ని గానీ, శిల్పాని గానీ సేవ్ చేసి ఉంటే ప్రేక్షకుల దగ్గర ఆయనకి మంచి మార్కులు పడేవి. కానీ బాబా భాస్కర్ పక్కా గేమ్ ప్లాన్ తోనే రవిని సేవ్ చేసుంటాడనే వాదన కూడా వినిపిస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: