జీవితం అన్నాక,ఎవరికైనా ఎత్తుపల్లాలు తప్పవు.ఇక సినిమాలో నటించే నటీనటులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.ఒక్క సారిగా వచ్చే స్టార్‌డం వాళ్లను ఆకాశానికి ఎత్తేస్తే, తర్వాత వచ్చే అపజయాలు వారి అవకాశాలను శాసిస్తాయి.ఇప్పుడు,నటి కాజల్‌ అగర్వాల్‌ విషయంలో ఇదే జరుగుతుంది.నిజం చెప్పాలంటే ఈ ఉత్తరాది బ్యూటీ నటజీవితం కోలీవుడ్‌లో అపజయాలతోనే మొదలైంది.అయితే ఆ తరువాత పోరాడి గెలిచారు.అలా జయాపజయాలతో ప్రయాణం చేసి అగ్రనటి స్థాయికి ఎదిగారు.ఇక ఈ మధ్య కాలంలో కాజల్‌అగర్వాల్‌ వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది.ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆమె జీవితం లో ఎదురుగాలి గట్టిగావీస్తుంది.ఎందుకంటే ఈ బ్యూటీకి ఇటీవల ఏ భాషలోనూ హిట్‌ లేదు.అలాంటి సమయంలో ఇటీవల తమిళంలో జయంరవితో నటించిన కోమాలి చిత్రం సక్సెస్‌ అయ్యి కాజల్‌కు నూతనోత్సాహాన్నిచ్చిందని చెప్పవచ్చు.



అయితే జయాపజయాలకు అతీతంగా ఈ ఉత్తరాది భామకు అవకాశాలు వరించడం విశేషం.కోమాలి చిత్రానికి ముందే స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్‌ 2లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఇక తెలుగులోనూ కొత్త చిత్రాలు చర్చలో ఉన్నాయని సమాచారం.ఇక ఈ బ్యూటీ ఇప్పటికే కొన్ని హింది చిత్రాల్లో నటించిన,అక్కడ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది.ఇక ఎలాగైన బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకోవాలని ఆశపడుతున్నతరుణంలో వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకో దలచుకోలేదట కాజల్.అందుకు ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా?



సాధారణంగా కాజల్‌ అగర్వాల్‌ ఒక తెలుగు చిత్రంలో నటించడానికి ఇతరత్రా ఖర్చులు కాకుండా రూ.1.75 కోట్లు పారితోషికం పుచ్చుకుంటుందని సమాచారం.ఇక అన్ని కలిసి రూ. 2 కోట్లకు చేరుతుందట.అలాంటిది హిందీ చిత్రానికి కేవలం రూ.30 లక్షలు మాత్రమే తీసుకుంటుందట ఇంతగా తన పారితోషికాన్ని తగ్గించుకుందన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.ఎంత హిందీ చిత్రంలో నటించాలన్న కోరిక ఉన్నా తన పారితోషికాన్ని అంత భారీగా తగ్గించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే  పారితోషికం తగ్గించుకున్నా ఫలితం దక్కితే సరి.లేదంటే ఇక ఈ అమ్మడు సినీ లైఫ్‌కు ఒకరకంగా చెప్పాలంటే ఎండింగ్ కార్డ్ పడ్డట్టేనని అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: