మొత్తం భారతీయ సినీ రంగంలో ఎక్కడా లేని వాతావరణం టాలీవుడ్లో కనిపిస్తోంది. మిగిలిన చోట్ల హీరోలు వేరు, టాలీవుడ్ హీరోలు వేరు. ఇక్కడ ఉన్నంత భిన్నత్వం మరెక్కడా కనిపించదు. టాలీవుడ్  దేశంలోనే అతి పెద్ద సినీ పరిశ్రమగా ఉంది. ఏటా  వందకు పైగా మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ విషయంలో ఒకటి మాత్రం కంప్లైంట్ ఉంది.


అదేంటి అంటే ఇక్కడ సీనియర్లు ఇంకా కుర్ర వేషాలు వేయడం. అరవైలు దాటినా కూడా ఇక్కడ హీరోలు అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ సీరియస్ సబ్జెక్ట్లను డీల్ చేయడం లేదని. దాంతో మంచి కధలు తెలుగు తెరపైన రావడం లేదన్నది అటు ఇండస్ట్రీలో, ఇటు ఆడియన్స్ లో  కూడా ఉంది. దీంతో హీరోయిన్ల కొరత కూడా ఎక్కడ లేని విధంగా పట్టిపీడిస్తోంది.
టాలీవుడ్లో సీనియర్ హీరోలంతా సిక్స్ టీ  ప్లస్ లో ఉన్నారు. వారికి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా ఉంది, ఇక టాప్ స్టార్స్ ఉన్నారు. వీరంతా బిలో ఫార్టీ ఫైవ్ లో ఉన్నారు.



యంగ్ హీరోయిన్లు  అంతా వీరి వైపే చూస్తున్నారు. సూపర్ స్టార్ డం వీరికి ఉండడంతో వీరికి హీరోయిన్ల ఇబ్బంది లేదు కానీ సినిమాకో హీరోయిన్ కావాలని కోరుకోవడంతోనే తంటా వస్తోంది. ఇక యంగ్ హీరోలు, స్టార్ ఇమేజ్ లేని వారు ఉన్నారు. వీరు కొత్త అమ్మాయిల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆ మూవీ హిట్ అయితే ఆ అమ్మాయిలకు ఇమేజ్ వచ్చేసి స్టార్ల వైపు వెళ్తూంటే ఎపుడూ న్యూ డిస్క‌వరీతో వీరు వర్రీ అవుతున్నారు.




మొత్తం మీద చూసుకుంటే టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత అంతా ఇంతా కాదు.  అందరికీ హీరోయిన్లు కావాలి.  అందరూ ఆడిపాడాలి.  డ్యూయట్లు ఉండాలి. దాంతో ఏటా వంద సినిమాలు తీసే టాలీవుడ్ కి ఇపుడు హీరోయిన్లు కనీసం పాతిక ముప్పయి మంది అయినా అవసరం అవుతున్నారు. కానీ అంతగా సప్లై లేకపోవడం వల్ల ఉన్న వారు డిమాండ్ పెంచేసి చెట్టెక్కి కూర్చుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: