మరో మూడు వారాలలో విడుదల కాబోతున్న ‘సైరా’ మూవీ మార్కెట్ ను పెంచుకోవడం కోసం ఈ మూవీ నిర్మాతలు చెపుతున్న మాటల పై విపరీతమైన గందరగోళం ఏర్పడటమే కాకుండా మెగా కాంపౌండ్ ఇస్తున్న లీకుల పై తీవ్ర విమర్శలు కూడ వస్తున్నాయి. వాస్తవానికి ‘సైరా’ మూవీ ప్రారంభోత్సవం రోజున ఈ మూవీని 150 కోట్లతో తీస్తున్నట్లుగా చరణ్ అధికారికంగా ప్రకటించాడు.

ఆ తరువాత కొంతకాలానికి చరణ్ ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు దాటి పోతోందని తన తండ్రికి తాను ఇచ్చే గిఫ్ట్ ఈ మూవీ కాబట్టి ఈ మూవీ లాభాల కోసం తాను నిర్మించడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ మూవీలో భారీ గ్రాఫిక్స్ ఉండటం వల్ల ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లకు చేరిపోయింది అనీ మరో లీక్ ఇచ్చాడు. 

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా నిన్న సుదీప్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ మూవీ బడ్జెట్ 270 కోట్లు అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో ‘సైరా’ బడ్జెట్ ఎంత అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరికొందరైతే ఇది అంతా ‘సైరా’ మార్కెట్ కోసం ఇస్తున్న లీకులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ‘సైరా’ మార్కెట్ గురించి వస్తున్న లీకులు అన్నీ యదార్దాలు కావనీ ‘సాహో’ ఫలితం తరువాత ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు అడ్వాన్స్ లు ఇచ్చి కొనుక్కున్న బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో బయ్యర్లకు ధైర్యం కలిగించే విషయంలో అల్లు అరవింద్ రంగంలోకి దిగి ‘సైరా’ బయ్యర్లకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ ధైర్యం చెపుతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: