టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . తొలితరం రేనాటి స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రెండవ సినిమాగా రాబోతున్న సైరాకు భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం జరిగింది. దానితోపాటు సినిమాకు పాన్ ఇండియా అపీల్ తీసుకురావడానికి అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి ఇతర భాష నటులను కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, 

సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించి నిన్న ఒక మీడియా ఛానల్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో సైరా ఒక అద్బుతమైన సినిమాగా మిగిలిపోనుందని, అలానే నరసింహారెడ్డి గారి పాత్ర కోసం మెగాస్టార్ తనను తాను మలుచుకున్న విధానానికి ఎంతైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అయన అన్నారట. ఇక సినిమా కోసం యూనిట్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, నిర్మాతగా రామ్ చరణ్ సినిమా కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు చెప్పారట. ఇక అతి త్వరలో ఈ సినిమాలోని మొదటి పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని, సినిమాలో మొత్తం మూడు పాటలుంటాయని, అందులో ఒకటి నేపధ్య గీతం అయితే, మరొక రెండు మాములు పాటలు అని సురేందర్ రెడ్డి చెప్పారట. 

ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల తెలుగు సినిమాల్లో ఆరు పాటలు పెట్టడం కొందరు దర్శకులు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక సైరాలో కేవలం మూడు పాటలుండడం, అందునా ఒకటి నేపధ్య గీతం కావడంతో సినిమాలో కేవలం రెండు పాటలే ఉంటాయని తెలిసి మెగాఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే  కేవలం సైరా మాత్రమే కాక, ఇకపై రాబోయే సినిమాల్లో కూడా పాటలు తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఒకరకంగా ఈ వార్త మెగాస్టార్ కి బ్యాడ్ న్యూసే నని అర్ధం అవుతోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: