వచ్చే వారం విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీని చాల భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి హరీష్ శంకర్ మాస్టర్ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ తమిళ మాతృక ‘జిగరతండ’ కు రీమేక్ గా తీస్తున్నప్పటికీ ఈ మూవీలో హరీష్ శంకర్ చాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా వరుణ్ తేజ్ గెటప్‌ క్యారెక్టరైజేషన్‌ ఈ సినిమాకు హైలైట్‌ అవుతుందని అంటున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రను పోషిస్తున్న వరుణ్ తేజ్ కు ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీని రెగ్యులర్ మూవీలా కాకుండా పీరియాడిక్ సెటప్ పెట్టి 1980 కాలంనాటి పరిస్థితులు అప్పటి ప్రేమలు మనుషులకు తగ్గట్టుగా ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయని టాక్. 

ఈ ఫ్లాష్ బ్యాక్ ఈ మూవీకి హైలెట్ గా మారుతుందని ఈ మూవీ చూసే ప్రేక్షకులు 1980 కాలంలోకి వెళ్ళిపోతారని ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ కాపీ చూసినవాళ్ళు చెపుతున్నారు.  దీనితో ఈ సినిమా సూపర్ హిట్ అన్న నమ్మకంలో హరీష్ శంకర్ ఉన్నట్లు సమాచారం. 

వాస్తవానికి గతంలో హరీష్ శంకర్ ‘డిజె’ తీసునప్పుడు కూడ ఇలాంటి లీకులు బయ్యర్లకు ఇచ్చారు. ఆ మూవీ అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలి అన్న కసితో హరీష్ శంకర్ ఈమూవీని తీసినట్లు చెపుతున్నారు. ఈ మూవీని వెరైటీగా ప్రమోట్ చేయడం కోసం వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ గెటప్ లో ‘జబర్దస్త్’ కార్యక్రమంలో తన తండ్రి నాగబాబు ఎదుట ఈ వారం ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో ఒక స్కిట్ చేయబోతున్నట్లు టాక్. దీనికి మెగా బ్రదర్ ఎదురగా మెగా ప్రిన్స్ స్కిట్ చేయబోతున్నాడు అంటూ మెగా అభిమానులు జోష్ లో ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: