మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.. మేడిన్ ఆంధ్రా స్టూడెంట్ అంటూ యూత్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.. బాలు బాలు అంటూ ప్రేమికుడిగా మెప్పించాడు.. తమ్ముడిగా చిలిపి పనులు చేస్తూ యూత్ ను ఆకట్టుకున్నాడు.. బద్రి బద్రీనాథ్ అంటూ మాస్ ను దగ్గరయ్యాడు.  అమ్మాయి సన్నగా అంటూ ఖుషి ఖుషిగా ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలకు చేరువయ్యాడు.. 


నాక్కొంచెం తిక్కుంది అని చెప్పి ప్రజలందరికి చేరువైన గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారేదితో మెప్పించాడు.  జల్సాలు చేసినా.. కాటంరాయుడిగా పంచెకట్టినా పవన్ కే చెల్లింది.  అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలను అజ్ఞాతంలో వదిలేయడంతో పాపం సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలామంది ప్రొడ్యూసర్లు అనుకున్నారు.  కొంతమంది నిర్మాతలు పవన్ కు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశారు.  


అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమాలు పక్కన పెట్టారు.  గత ఎన్నికల్లో పవన్ ఓడిపోవడం, పార్టీ కూడా ఓడిపోవడంతో పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తారని అనుకున్నారు.  కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే ఉన్నారు.  రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు.  ఇది రాజకీయనాయకులకు కాదు అటు సినిమా నిర్మాతలకు కూడా నచ్చలేదు.  


పవన్ తో సినిమా చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా ట్రై చేస్తున్నారు.  అలా ట్రై చేస్తున్న నిర్మాతల్లో ఎఏంరత్నం కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ కు గతంలో అడ్వాన్ ఇచ్చారు. పవన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు.  పవన్ మాత్రం కాదని అంటున్నారు.  చరణ్ తో సినిమా చేయాలని అన్నారు.  చరణ్ తో సినిమా తరువాత చేస్తాను.. ముందు మీరు సినిమాలో చేయాలనీ, మీతో సినిమా తరువాతే మరో సినిమా ఆలోచిస్తానని అంటున్నాడు రత్నం.  అయన ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసి తీసుకొచ్చి పవన్ కు చూపించారని వినికిడి.  పవన్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారట.  మరి పవన్ సినిమా చేస్తారా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: