ఇటీవల "చిత్రలహరి" చిత్రంతో  ఓ మాదిరి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కాగా ఆయన తాజాగా కామెడీ, రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ దర్శకత్వంలో "ప్రతి రోజు పండగే" అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం  హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది ఈ చిత్రం.  కాగా తాజాగా ఈ చిత్రం నుండి చిత్రయూనిట్ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.   ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. చేతిలో చేయి వేసి ఉన్న ఈ ప్రీ లుక్ లో ఓ పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు.  అయితే రేపు రాత్రి  ఎనిమిది గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారు.  ఇక  క్రిష్టమస్ సందర్భంగా  డిసెంబర్ 20న  ఈ చిత్రాన్ని   విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇక త్వరలో రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.  అయితే  బాహుబలి కట్టప్పగా పేరుగాంచిన నటుడు సత్యరాజ్ "ప్రతిరోజూ పండగే" చిత్రంలో ధరమ్ తేజ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట.  కమల్ హాసన్ హీరోగా 1978లో విడుదలైన  "సత్తం ఎన్ కైయిల్" చిత్రంతో  సత్యరాజ్ సినీరంగ ప్రవేశం చేసి..  విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  అనేక వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు.    


కాగా  "ప్రతి రోజు పండగే" చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ "సుప్రీం" సినిమాలో కలిసి నటించడం జరిగింది.  ఇక మిగిలిన కీలక పాత్రల్లో  విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: