తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం  అక్టోబర్ 2 న తెలుగు తో పాటు హిందీ కన్నడ, మలయాళ , తమిళ  భాషల్లో  విడుదలకు కానుంది. కాగా  ఇప్పటికే  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తాజాగా నాన్ థియేట్రికల్  బిజినెస్ విషయంలో కూడా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం యొక్క అన్ని భాషల డిజిటల్ హక్కులను  40కోట్లకు అమెజాన్ ప్రైమ్  దక్కించుకుందని సమాచారం.



అయితే శాటిలైట్ హక్కుల విషయం లో  క్లారిటీ రావాల్సి వుంది.  ఇక డిజిటల్  హక్కులు  ఈరేంజ్ లో ధర పలకడంతో  ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదలకానుంది. సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా  అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు  విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  కాగా తాజాగా  హిందీ వెర్షన్ లో తన పాత్రకు  సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసింది తమన్నా.  



కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్  మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.  కాగా ఈచిత్రం యొక్క  ట్రైలర్ ను ఈనెల  15న విడుదలచేయనున్నారని  సమాచారం.  మరి సాహో తరువాత  దేశ వ్యాప్తంగా  భారీ అంచనాల  మధ్య  విడుదలకానున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.   సాహో ను ఓవర్సీస్ లో విడుదల చేసిన ఫార్స్ ఫిల్మ్స్  ఈ చిత్రాన్ని కూడా అక్కడ విడుదలచేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: