రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ రెండు సినిమాలతో మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. దానితో ఆయన తదుపరి సినిమా సాహో పై అందరికి విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అదే విధంగా ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా, యువి క్రియేషన్స్ నిర్మాతలు సాహోను అత్యంత భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ సంపాదించి, ప్రస్తుతం నత్తనడకన ముందుకు సాగుతోంది. 

నిజానికి ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆశలు పెట్టుకోగా చల్లవరకు వారి ఆశలు అడియాశలయ్యాయి. పెద్దగా ఆకట్టుకోని కథ, కథనాలతో తెరకెక్కిన సాహో సినిమాలో కేవలం గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే విపరీతంగా ఖర్చు చేసారని, ప్రేక్షకుడు మెచ్చే విధంగా సినిమాను తీయడంలో దర్శకుడు సుజీత్ పూర్తిగా ఫెయిల్ అయినట్లు మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాతో నిరాశ పడ్డ తన ఫ్యాన్స్ ను, ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న జాన్ సినిమాతో హిట్ కొట్టి, వారిలో ఫుల్ జోష్ నింపాలని చూస్తున్నాడట ప్రభాస్. 1960ల కాలంనాటి యూరోప్ ప్రాంతంలోని జరిగిన ప్రేమకథగా తెరేకుక్కుతున్న ఈ సినిమాలో, సాధారణ ప్రేక్షకులతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు మిళితం చేసాడట దర్శకుడు రాధాకృష్ణ. 

అయితే సాహో ఫెయిల్యూర్ తరువాత, జాన్ సినిమాకు సంబంధించి ప్రభాస్ కొన్ని మార్పులు చేర్పులు చేయమన్నట్లు సమాచారం. ఎలాగయినా సాహోతో కొంతవరకు దెబ్బతిన్న ఇమేజీని, మళ్ళి జాన్ సినిమాతో తిరిగిపొందాలని సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నాడట ప్రభాస్. గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: