చిత్రం అంటేనే ఆశ్చర్యం . మనం అనుభవించని అనుభూతిని దృశ్యాలుగా  చూడడం వల్ల అనుభూతి పొందడమే చిత్రం పరమార్థం. వ్యక్తులు, వారి ఆలోచనలు  పనితీరు సమాజం కోసం పరితపించిన విషయాలు చరిత్ర అయితే ఆ చరిత్ర సృష్టించిన వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను బయోపిక్ లుగా తీస్తారు. చెప్పాలంటే బయోపిక్ అంటే  "చరిత్ర సృష్టించిన వ్యక్తుల యొక్క చరిత్ర గుర్తించని ఆత్మకథ".


 ఆత్మకథలకు దృశ్య రూపకం చేసి చిత్రాలుగా నిర్మించిన చిత్రాలన్నీ దర్శకుల ప్రతిభను వివరిస్తాయి తప్ప వ్యక్తుల జీవితాలను గుణగణాలను పూర్తిగా బహిర్గతం చేయలేవు. చేయవు ఎందుకంటే , చరిత్ర లొని గొప్పవాళ్ళని వ్యక్తుల అంతర్గత జీవితంలోని తప్పులను ఎత్తిచూపే దైర్యం   దర్శకుడికి ఉండదు కాబట్టి బయోపిక్ లను మనకు తెలియని ఈ అంశాలను దర్శకులు సృషిం చాడు అని మాత్రమే చూడాలి తప్ప దాని లోని నిజా నిజాలను వెలికితీసే ప్రయత్నం చేయకూడదు.


మనం గౌరవించే మనం అభిమానించే వ్యక్తి జీవిత కథా చిత్రంగా మలచ  పడ్డదని గర్వపడాలి తప్ప, అందులోని అంశాలను లోతుగా విశ్లేషించుకోవడం అనవసరం. మనిషి జీవితానికి కానీ సినిమా కథ అనే కథకు గాని గమనానికి మూలం "ప్రేమ" .మన చుట్టూ ఉన్న సమాజం లోని వ్యక్తుల్లో గానీ మనం చూస్తున్న సినిమాల్లోని పాత్రలు కానీ ఆ ప్రేమ తాలూకు నిడివి ఎంత విశాలంగా ఉందనేది మనం గమనించాల్సిన ముఖ్య అంశం.


వ్యక్తిలోని ప్రేమించే గుణం శాతాన్ని బట్టే మిగతా స్వభావాలుఅతన్ని   ప్రభావితం చేస్తాయి . ప్రేమ పాళ్ళు ఎక్కువున్నవాళ్ళే తమలోని అంతర్గత శక్తిని విస్తరించుకుని ఆ రంగంద్వారా సమాజానికి దగ్గర అవుతారు .ఈ విషయమంతా ఎందుకు చెబుతున్నానంటే రాబోయే 2019 సంవత్సరం మొత్తం చిత్రసీమలో బయోపిక్  పరంపర  కాబట్టి బయోపిక్ చిత్రాలను చూసేటప్పుడు మన ఆలోచనా ధోరణి ఏవిధంగా ఉండాలన్నదే నా  ఉద్దేశం.


మరింత సమాచారం తెలుసుకోండి: