ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ కు, ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్న పాయల్, ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. కాగా అందులో ఒకటి RDX Love.  తేజాస్ హీరోగా శంకర్ భాను దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ అందంతో పాటు అభినయానికి స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో, 

నేడు ఈ సినిమా ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 'నీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను, అనగనగా ఒక ఊరు' అంటూ పాయల్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడీ పిల్లలా కనిపించొచ్చు, కానీ అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగసింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది' అంటూ ఈ ట్రైలర్ లో పాయల్ రాజ్ పుత్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్, మొత్తం ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి. 'అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్రతిమాలండి కరిగిపోతారు, కానీ అబద్దం చెప్పి బాధపెట్టకండి, కరిగించేస్తారు' అంటూ ట్రైలర్ చివరిలో ఆమె పలికే డైలాగ్ ఎంతో ఆకట్టుకుంటుంది. 

మొత్తంగా యాక్షన్, లవ్, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్ కలగలిపిన ఈ  RDX Love ట్రైలర్, త్వరలో రిలీజ్ కానున్న సినిమాపై అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ మంచి వ్యూస్ రాబడుతూ దూసుకుపోతోంది. ఇంకా ఈ సినిమాలో ఆదిత్య మీనన్‌, నాగినీడు, తులసి, ఆమని, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ఇతర పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాకి  సమర్పణ: రామ్‌ మునీశ్‌, కెమెరా:సి.రాంప్రసాద్‌, సంగీతం: రాధాన్, అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: