విమాన ప్రయాణం అంటే అందరూ ఆనందంగా ఫీలవుతారు. ఆకాశంలో విహారం, సౌకర్యం, విలాసవంతమైన ప్రయాణమంటూ సంబరపడిపోతూంటారు. అయితే.. విమానంలో ఇందుకు భిన్నంగా ప్రయాణించాడు ఓ ప్రయాణికుడు. ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తనకు అలా సీట్లో కూర్చోవడం ఇబ్బందిగా అనిపించిందేమో.. విభిన్నంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

 

 

 

దూర ప్రాంతాలకు ప్రయనించేటప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం ఎవరికైనా ఇబ్బందే. ఇదే ఫీల్ అయ్యాడు ఓ విమాన ప్రయాణికుడు. అంతసేపు సీట్లో కూర్చోవడం ఇబ్బందిగా అనిపించి తన సీటు కింద దూరిపోయి ఏకంగా కాళ్ళు చాపుకుని సీట్ల కింద పడుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇలా పడుకున్న ఆ వ్యక్తి ఫోటోను ఓ వ్యక్తి  ప్యాసెంజర్స్ షేమింగ్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. 'ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐడియాలు ఎలా వస్తాయో' అంటూ నేటిజెన్ రాసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ, ఏ ఫ్లైట్ లో అనేది తెలీలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

 

 

 

కొందరు ఈ వ్యక్తి చేసిన పనిని ఖండుస్తూండగా, మరికొందరు.. బాగుంది, ఈసారి ట్రై చేయాలి', 'అతను పడుకున్నప్పుడు సీటు కింద ఊసను తప్పించుకుని ఎలా పడున్నాడు', 'నాకు సీటు.. సీటుకు మధ్యలో స్పేస్ ఇస్తే నేనూ ఇలా ట్రై చేస్తా', 'ఆ వ్యక్తి సీటు కిందకు ఎలా వెళ్ళాడో.. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు బయటకి ఎలా వచ్చాడో వీడియో చూడాలనుంది, అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.టిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రైలు సెకండ్ క్లాస్ కంపార్టుమెంట్ లో సీట్లు ఫుల్ అయితే కింద కూర్చున్నట్టు, పైన బెర్తు ఎక్కినట్టు విమానంలో ఈ పని చేసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రేండింగ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: