ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా 2020 జులై 30 వ తేదీన విడుదల కాబోతుంది. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు హీరోయిన్ గా విదేశీ భామ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు. . 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి ఎన్టీయార్ మీద కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో జూనియర్ ఎన్టీయార్ టైగర్ తో పోరాడబోతున్నాడని తెలుస్తుంది. ఎన్టీయార్ పోరాడేది నిజమైన టైగర్ కాకపోయినప్పటికీ రాజమౌళి ఈ సీన్ ను అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో భారీగా గ్రాఫిక్స్ తో కూడిన సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. 
 
చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరమ్ భీమ్ ఒకరినొకరు కలవలేదు. వారిద్దరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఊహాజనితమైన కథతో రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నాడని తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను 400 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు 2020 జులై 30 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 
 
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అజయ్ దేవగన్ భగత్ సింగ్ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాడని సమాచారం. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీయార్ ఫస్ట్ లుక్ అక్టోబర్ 22 వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తుంది. కొమరమ్ భీమ్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: