సినిమా ఇండస్ట్రీకి ప్రతీ సంవత్సరం ఎందరో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. వాళ్ళలో టాలీవుడ్ కి కొందరు కొత్త హీరోయిన్లు పరిచయమవుతారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయితే మిగతా వారు ఛాన్స్ లేక ఇబ్బంది పడుతుంటారు. వాస్తవంగా ఒక హీరోయిన్..ఏ హీరోతో ఫస్ట్ డెబ్యూ చేస్తుందో ఆ తర్వాత ఆమెకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతుంటాయి. కానీ కొంతమంది హీరోయిన్స్ విషయంలో ఇది కంప్లీట్ రివర్స్ అవుతుంది. ఏ హీరో తో ఎంట్రీ ఇస్తుందో గాని ఆ హీరో తో ఫస్ట్ డెబ్యూ చేసిన తర్వాత అస్సలు కలిసి రాదు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకొచ్చినప్పటికి ఐరెన్ లెగ్ అనో లేక ఫ్లాప్ హీరోయిన్ అనో స్టాంప్ పడిపోతుంది. ఒకవేళ ఫస్ట్ సినిమా హిట్టయినా మళ్ళీ మొహానికి రంగేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. 

అయితే ఇప్పుడు నాని హీరోయిన్ కూడా టాలీవుడ్ లో ఆఫర్స్ లేక ఇబ్బంది పడుతుంది. ఈ ఏడాది నాని నటించిన 'జెర్సీ' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రద్దా శ్రీనాథ్. కన్నడలో హీరోయిన్ గా మంచి సక్సస్ లు తన ఖాతాలో ఉన్న శ్రద్దా తమిళ్ లో కూడా సినిమాలు చేసినప్పటికీ ఈ ఏడాది టాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిందని అర్థమవుతోంది. అయితే 'జెర్సీ' కంటే ముందే ఆదితో 'జోడి' సినిమా చేసింది. కానీ మొదటి సినిమా కంటే ముందే రెండో సినిమా విడుదలైంది. దాంతో శ్రద్దాకి తెలుగులో 'జెర్సీ' డెబ్యూ సినిమా అయింది. 

'జెర్సీ' తర్వాత తెలుగులో బిజీ అవ్వాలని చాలా ఆశలు పెట్టుకుంది శ్రద్దా. కానీ ఆ సినిమాలో క్రెడిట్ అంతా నాని కే వెళ్ళింది. నటన పరంగా పరవాలేదు కానీ ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ కాదనే ఫీడ్ బ్యాక్ అందుకుంది. అందుకు ముఖ్య కారణం జెర్సీ లో గ్లామర్ గా కనిపించకపోవడమే. అందువల్ల శ్రద్దాకి 'జెర్సీ' తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. 'జోడీ' సినిమా అయినా తెలుగులో తనకి ఆఫర్స్ అందిస్తుందని ఆశిస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. అయితే ప్రస్తుతానికి శ్రద్దా కన్నడలో రెండు సినిమాలు తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది. మరి ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో మళ్ళీ అవకాశం ఎప్పుడుస్తుందో..? ఒకవేళ అవకాశం వస్తే మాత్రం కాస్త గ్లామర్ గా కనిపించి ప్రేక్షకులను అట్రాక్ చేస్తే ఆ తర్వాత ఛాన్సులు దక్కొచ్చు. మరి గ్లామర్స్ గా కనిపించడానికి ఒకే అంటుందో లేదో.  



మరింత సమాచారం తెలుసుకోండి: