భారీ బడ్జెట్ సినిమాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ గా కనిపిస్తున్న పాయింట్ ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఎందుకనో ఈ విషయాన్ని కాస్త సీక్రెట్ గానే ఉంచుతున్నారు. ఇప్పటివరకూ 'బాహుబలి'.. '2.0'.. 'సాహో' విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ ముందు ఒకటి చెప్పడం. తర్వాత సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది భారీగా పెరిగి ఆకాశమంత అవుతుందని అనడం. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత బడ్జెట్ అని ఒకటే నంబర్ చెప్తారా అంటే ఫిలింమేకర్లే రక రకాల ఫిగర్లు చెప్తారు. ఇప్పుడు తాజాగా 'సైరా' విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుంది.

'సైరా' కి ముందు అనుకున్న బడ్జెట్ రూ. 150 కోట్లు. అయితే తండ్రి సినిమా కాబట్టి చరణ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నాడని.. చిరంజీవికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది కాబట్టి  ఖర్చుకు వెనకాడకుండా సురేందర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని.. బడ్జెట్ రూ. 200 కోట్లు దాటిందని తర్వాత అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లు దాటిందని అని కూడా అన్నారు. అయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి 'సైరా' బడ్జెట్ రూ.300 కోట్లు వరకు అయిందంటు ఇన్‌డైరెక్ట్ గా అన్నారు. 
పైగా 'బాహుబలి' నిర్మాతల తర్వాత ఇలా క్వాలిటీ కోసం రాజీ పడకుండా సినిమా కోసం ఖర్చు పెట్టిన నిర్మాత చరణ్ మాత్రమేనని ప్రశంసలు కురిపించడంతో పరోక్షంగా ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు అనే విషయం ఒప్పుకున్నట్లు అర్థమైంది. 

అయితే ఇప్పటివరకూ 'సైరా' బడ్జెట్ కరెక్ట్ గా ఎంత అయిందనే విషయం అటు మెగాస్టార్, చరణ్ కానీ ఇటు సురేందర్ రెడ్డి కానీ ఓపెన్ గా చెప్పలేదు. దీంతో 'సైరా' బడ్జెట్ విషయంలో జోరుగా స్పెక్యులేషన్లు కొనసాగుతున్నాయి. ఇంతకీ 'సైరా' రియల్ బడ్జెట్ ఎంత? అని. ఇక ఈ విషయంపై ఒక క్లారిటి  ప్రమోషన్స్ సమయంలో కానీ మనకు కొద్దో గొప్పో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: