ఆర్డీఎక్స్ లవ్.. ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన ఆధారంగానే ఈ సినిమా ప్రమోషన్ ఇప్పటివరకూ సాగింది. ఇప్పటి వరకూ పాయల్ రాజ్ పుత్ ను ఓ అందాల బొమ్మగా చూపిస్తూ హాట్ హాట్ పోస్టర్లు రిలీజ్ చేశారు. కేవలం పాయల్ రాజ్ పుత్ అందాలనే పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్నారా అనిపించారు.


తాజాగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ షాక్ ఇస్తోంది. ఇందులోనూ పాయల్ రాజ్ పుత్ అందాల ప్రదర్శనే ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసినవారికి షాక్ ఇస్తూ కనీసం ఒక్క సీన్ కూడా ట్రైలర్ లో లేదు. అలా లేకపోగా ఏకంగా పాయల్ రాజ ఫుత్ లేడీ ఒరియెంటెడ్ సినిమానా అన్నట్టు గా ట్రైలర్ సాగింది. ట్రైలర్ చూస్తే సినిమాలో కథ కూడా చాలా పకడ్బందీగా ఉన్నట్టు అనిపిస్తోంది.


నదీతీరంలో ఉన్న ఓ గ్రామంలో సమస్య ఆధారంగా సినిమా కథ అల్లుకున్నట్టు కనిపిస్తోంది. నిజంగా మా ఊరి సమస్య తీరుతుందంటే మా ఊరంతా ఆత్మాహుతికి సిద్దంగా ఉన్నారు అంటూ సీనియర్ నటులు నరేశ్ చెప్పే డైలాగ్ తోనే స్టోరీ డెప్త్ లీలగా అర్థమవుతోంది. ఇంత అందమైన అమ్మాయిలకు ఇంత రిస్కీ జాబ్‌ అవసరమా అని హీరో పాయిల్ ను ప్రశ్నిస్తున్న తీరు చూస్తే.. ఆమె కీలక ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.


అంతే కాదు.. వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడి పిల్లలా కనిపించొచ్చు.. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకు మగ సింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది అంటూ పాయల్ చెప్పే డైలాగ్ తో ఆమె పాత్ర ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతోంది. అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బతిమాలండి కరిగిపోతారు.. అబద్దం చెప్పి బాధపెట్టకండి.. కరిగించేస్తారు..అన్న డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తం మీద ఈ సినిమా అల్లాటప్పా సినిమా కాదని.. సీరియస్ స్టోరీ ఉన్న సినిమా అని ట్రైలర్ నిరూపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: