కాజల్ దాదాపు దశాబ్దంన్నర క్రితం తెరకు పరిచయమయింది. తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇన్నేళ్లు తెరమీద కనిపించడమే గొప్ప విషయం. దీంతో సహజంగానే కాజల్ అగర్వాల్ తన పారితోషకాన్ని కొన్ని సినిమాలకు తగ్గించుకోవాల్సి వస్తోందట. సౌత్ లో ఏజైన హీరోల సరసన కాజల్ కు అవకాశాలున్నాయి. అవి భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో..ఈ సినిమాలకు మాత్రం కోరినంత పారితోషకం ఇచ్చి తీసుకుంటున్నారు. 

ఆ హీరోలకు ఛాయిస్ లేదు. దీంతో కాజల్ కు భారీ పారితోషకం ఇచ్చిమరీ తీసుకుంటున్నారు కాబట్టి పాపులారిటి పరంగా ఏమాత్రం సమస్య లేదు. అయితే కాజల్ కు బాలీవుడ్ లో సక్సస్ కావాలని ఉందట. బాలీవుడ్ లో ఇంతకముందే కొన్ని సినిమాల్లో నటించింది. అయితే.. ఆ సినిమాలేవి కాజల్ కు పేరు తీసుకురాలేదు. 'స్పెషల్ చబ్బీస్' వంటి కమర్షియల్ సినిమాను చేసింది. అయితే ఆ సినిమా హిట్ అయినప్పటికి కాజల్ కు మాత్రం అది పేరు తీసుకురాలేదు. దీంతో బాలీవుడ్ లో కాజల్ సక్సస్ అవ్వాలని తెగ తాపత్రయపడుతోంది.

అందుకే బాగా తక్కువ పారితోషకం ఆఫర్ చేసినప్పటికి కాజల్ హిందీ సినిమాల్లో నటించడానికి తహతహలాడుతుందని టాక్. తాజాగా ఒక హిందీ సినిమాకు అయితే కేవలం ముప్పై లక్షల రూపాయల మొత్తానికే కాజల్ సైన్ చేసిందట. ఇదేగనక నిజమైతే కాజల్ అందుకుంటున్న అతి తక్కువ పారితోషకం ఇదేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 
కాజల్ సౌత్ లో ఇప్పటివరకు కోటి పైనే రెమ్యునిరేషన్ అందుకుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది బాలీవుడ్ సినిమాకోసం మరీ దిగజారి ఫ్లాప్ హీరోయిన్ లాగా కేవలం 
ముప్పై లక్షల కే ఓకే చెప్పడం చూసి కాజల్ కి ఏమైందని షాకవుతున్నారు. బాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే చాలన్న కాన్సెప్ట్ తో  కాజల్ తన రెమ్యునిరేషన్ ని భారీగా తగ్గించుకున్నట్టుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: