బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో ప్రస్తుతం మూడో సీజన్ చాలా ఆసక్తిగా ముందుకిసాగుతుంది. ఊహించని పరిణాలతో .. ఉహించలేనటువంటి ట్విస్టులతో రసవత్తకరంగా సాగిపోతుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఇప్పటికే 50 రోజులు గడచిపోయాయి. షో  50 రోజులు పూర్తవడంతో హౌస్‌మేట్స్ మధ్య గేమ్ ,మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే హౌస్లో నుండి ఆరుగురు హౌస్ మేట్స్ బయటకి వెళ్లిపోయారు. ఒకవారం ఎలిమినేషన్స్ ని రద్దు చేయడంతో పునర్నవి , మహేష్ , హిమజలు తప్పించుకున్నారు. ఇక ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ ఇప్పటికే ముగిసిపోయాయి. ఈ వారం హౌస్ నుండి బయటకి పోవడానికి ..పునర్నవి , మహేష్ , శ్రీముఖి , హిమజ , శిల్ప నామినేట్ అయ్యారు. రవి కూడా నామినేషన్స్ లోకి రాగ , ఇంటి కెప్టెన్ గా ఉన్న బాబా భాస్కర్ తనకున్న స్పెషల్ పవర్ ఉపయోగించి రవిని నామినేషన్స్ నుండి బయటపడేసాడు. 

ఇక తాజాగా బిగ్ బాస్ నుండి ఒక ప్రోమో విడుదల అయ్యింది. ఈ తాజా ప్రోమోని ఒకసారి చూస్తే .. బిగ్ బాస్ హౌస్లో తన హాట్ హాట్ అందాలతో అభిమానులని అలరిస్తూ వస్తున్న పునర్నవి ఫుల్ ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నామినేషన్స్ ముగిసిపోవడంతో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ టాస్క్ లో హౌస్లోని కొంతమంది దెయ్యాలుగాను ..మరికొందరు మనుషులుగాను ఉండనున్నారు. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో  గార్డెన్ ఏరియాలో పున్నరవి కూర్చొని ఉండగా.. వెనకాల నుండి  బాబా భాస్కర్, శిల్ప, వితిక, హిమజ వచ్చి పునర్నవిని  అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేసారు.

పూల్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. హౌజ్‌మేట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేంటి అంటూ వరుణ్ తో చెప్తుంది. హౌస్ మేట్స్ చేసిన దానికే వరుణ్ కూడా సపోర్ట్ చేసాడు. అది జస్ట్ టాస్క్ లో భాగమే అంటూ పునర్నవి తో చెప్తున్నాడు. కానీ పునర్నవి మాత్రం మరింతగా రెచ్చిపోయినట్టు అర్థమౌతుంది. అది ఒకవేళ టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని హౌస్ మేట్స్ పై విరుచుకుపడింది. ఆ తరువాత  బిగ్‌బాస్ తో మాట్లాడుతూ .. ఇవేం టాస్క్‌లు.. మీ గేమ్‌ని మీరే ఆడుకోవాలని అరుస్తూ.. నేను ఆడను అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించేంతలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: