ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన నటిమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో సంఘవి తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. గ్లామర్ పాత్రల్లో నటించి కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు నటనపై ఆసక్తి ఉండేది.  నా అసలు పేరు కావ్య .. తమిళంలో అజిత్ సరసన నేను తొలి సినిమాగా 'అమరావతి' చేశాను. తొమ్మిదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తరువాత సెలవుల్లో తమిళంలో 'అమరావతి' చేశాను. 

అప్పటి నుంచి సినిమాల్లో బిజీ కావడంతో ఇక పదో తరగతి పూర్తి చేయడం కుదరలేదు. నా కెరీర్ లో ఇప్పటి వరకు 99 మూవీస్ చేశాను..అయితే సెంచరీ కొట్టాలంటే మంచి కథ, మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. తెలుగులో నేను చేసిన సినిమా 'సిందూరం' అంటే నాకు ఇష్టం. నన్ను ఫ్లైట్ లో చూసిన కృష్ణవంశీ  ఈ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేశారు. ఒక మంచి ప్రాజెక్టులో భాగం కావాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి నేను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో వచ్చిన 'యమలీల' సినిమాను తమిళంలో రీమేక్ చేయగా 'ఇంద్రజ' పాత్రలో నేను చేశాను.   

తెలుగులో 'తాజ్ మహల్' చేసే ఛాన్స్ వచ్చింది.  అప్పట్లో తెలుగు లో టాప్ హీరోలందరితో నటించాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల సరసన నటించాను. ఇక  బాలకృష్ణ తో నేను 'సమరసింహా రెడ్డి'.. 'గొప్పింటి అల్లుడు' సినిమాలు చేశాను. మిగతా హీరోలు కాస్త సాఫ్ట్ గా ఉంటారు..బాలయ్య మాత్రం షూటింగ్ స్పాట్ లో గంభీరంగా ఉంటాడని చెప్పడంతో ఆయన్ని చూడగానే మొదట భయం వేసింది. నేను దూర దూరంగా ఉండటం గమనించి ఆయన నా దగ్గరకు వచ్చి..ఎందుకలా భయపడుతున్నావు అని ప్రశ్నించారు. వెంటనే సార్ మీకు కాస్త కోపం ఎక్కువంట కదా..నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఇబ్బంది అవుతుందని అన్నాను. దాంతో ఆయన ఒక్కసారే నవ్వుతూ..నేను భయపెట్టేవాడిని కాదు..భయం పోగొట్టేవాడిని అంటూ ఎంతో ధైర్యం చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: