యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌.  కాగా  గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు.  అయితే నిన్న ఈ సినిమా టీజర్ ను  రిలీజ్ చేసింది చిత్రబృందం.   నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది. అయితే ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోయారు. ఇప్పటికే  ఈ సినిమాకి 47 కోట్లు దాటేలా ఉందట.   ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో   లాంగ్ షెడ్యూల్స్ షూట్  చెయ్యడం.. పైగా  సినిమాలో  బడ్జెట్ తో కుడనుకున్న  యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకూ  భారీగానే ఖర్చు అయిందట.  దాంతో మొదట  32కోట్ల అనుకున్న  బడ్జెట్  కాస్త, ఇప్పుడు  47 కోట్లు దాటేలా ఉందది.  మరి గోపీచంద్ పైనా  నలభై ఐదు కోట్లు వర్కౌట్ అవుతాయా ?  ఇంతకి ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే.  అందుకే భారీ మొత్తానికి  సినిమాని అమ్మాలని చూస్తున్నారట మేకర్స్. 

 

కాగా గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు.  కాగా ఈ చిత్రంలో  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.  ఇక ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.  ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా  విడుదల చేస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.  ఇక  ఈ సినిమాకి  సాంకేతిక నిపుణులు :  కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : తిరు,  నిర్మాత: రామబ్రహ్మం సుంకర,  సంగీతం: విశాల్ చంద్రశేఖర్,  సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి,  రచయిత: అబ్బూరి రవి. 


మరింత సమాచారం తెలుసుకోండి: