తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ 3 లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ అందరి మనసు దోచిన అలీ రెజా ఎవరూ ఊహించని విధంగా మొన్నటి ఆదివారం ఎలిమినేషన్ అయ్యాడు.  విచిత్రం ఏంటంటే అంతకు ముందు వారం వరకు అలీ రెజా ఒక్కసారి కూడా ఎలిమినేట్ రౌండ్ లోకి రాలేదు. మొదటి సారి రావడం..ఇంటి నుంచి వెళ్లిపోవడం ఒక్కసారే జరిగిపోయింది.  అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇంటి సభ్యులు ఎంతో ఎమోషన్ కి లోనయ్యారు.  సొంత మనిషి తమ నుంచి విడిపోతున్నంత బాధతో కన్నీరు మున్నీరు అయ్యారు.

ముఖ్యంగా శివజ్యోతి అయితే చిన్న పిల్లలా ఏడ్చేసింది. బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ వీరీంతా కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆప్యాయతకు దూరమైన అలీ ఎంతో బాధతో ఇంటికి పయనమయ్యాడు..కానీ ఇంటికి వెళ్లిన తర్వాత మరో భయంకరమైన విషయాన్ని విని షాక్ తిన్నాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలోనే తన మావయ్య చనిపోయాడని ఇంటికి వెళ్ళాక తెలిసిందని అలీ రెజా భావోద్వేగానికి గురయ్యాడు.  అయితే బిగ్ బాస్ లో తాను గట్టి పోటీతో ఉండటం..ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూస్ వింటే నా మనోధైర్యాన్ని కోల్పోతానని ఇంటి సభ్యులు భావించారట. ఈ వార్త నాకు తెలిస్తే నేను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పై ఫోకస్ చేయలేనని మా తల్లిదండ్రులకు తెలుసు.

అదే సమయంలో నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ముఖ్యం..అందుకే ఇంత పెద్ద విషాదాన్ని నాకు తెలియకుండా దాచారు. ఎలిమినట్ అయి షాక్ లో ఇంటికి వెళ్లిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది.  నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా.. లవ్ యు ఫరెవర్ మావయ్య అని అలీ రెజా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.  నిజంగా మనిషికి ఒక్కసారే బాధలు వరుసగా వస్తాయంటారు..నిజంగా అలీ రజా కు కూడా ఇలాంటి బాధలే రావడం బిగ్ బాస్ ప్రేక్షకులకు కన్నీరు పెట్టించింది. 

View this post on Instagram

You wanted to see me successful in life and now that i have so many people loving me and praising me ur not there to see that. I wish i could atleast see you for the last time. Mom dad could not send any information cause they knew how important Bigg boss was for me and they dint wanted this to effect my game but they dint know you were equally important for me in life . By the time I could come out of my elimination shock i got another huge shock of you being No more. There has been so much of greef at home and still everyone trying to stay happy and support me . I want nothing more in life after seeing all the love and support from all over . Mama you were the best, Your the best and will always remain the best. Ill always have the regret of not getting to see u for the last time. Love you forever. May your soul rest in peace.

A post shared by Ali Reza (@i.ali.reza) on

మరింత సమాచారం తెలుసుకోండి: