లావణ్య త్రిపాఠి అట్టర్ ఫలాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్. అందాల రక్షేషి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా లావణ్య త్రిపాఠి ఒక్క సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయినప్పటి ఆ తరువాత ఎన్ని సినిమాలు తీసిన అన్ని ప్లాప్ అవుతూనే వచ్చాయి. ఆమె కెరియర్ మొత్తం వెతుకున్న రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ హిట్లు లేవు. 


ఆ హిట్లు కూడా హీరోల అదృష్టం వల్ల ఆమెకు ఆ హిట్లు చేతిలో పడ్డాయని చెప్పచ్చు. అవి కూడా నాని 'భలే భలే మగాడివోయ్' సినిమా, మంచు విష్ణు 'దూసుకెళ్తా' సినిమాలు హిట్లు ఇచ్చాయి. ఆ రెండు హిట్లే అయినా ఆమెకు ఇండస్ట్రీలో మంచి పేరుని ఇచ్చాయి. ఆమెకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది కానీ హిట్లు లేవు. అయితే ఇంకా విషయానికి వస్తే .. 


లోక్ సభ స్పీకర్ 'ఓం బిర్లా' బ్రాహ్మణుల విశిష్టత గురించి చేసిన వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి ఘాటుగా సమాధానం ఇచ్చింది. 'కులం ఆధారంగా గొప్పవాడివి కాలేవు' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఏమైందో తెలీదు కానీ కొద్దిసేపటికే ఆమె ఆ ట్వీట్ ను తొలగించింది. అయితే అప్పటికే ఆ ట్విట్ వైరల్ అయ్యింది. దీంతో ఆ ట్విట్ ఎందుకు డిలీట్ చేశారంటూ ఓ మీడియా ఆమెని ప్రశ్నించింది. 


దీంతో ఆమె ఆ ప్రశ్నకు వివరణ ఇచ్చింది. ''నా అభిప్రాయాలను బలంగా వినిపించే క్రమంలో ఎవరి మనోభావాలను గాయపర్చడం నా ఉద్దేశం కాదు. అందుకే ఆ ట్వీట్ తొలగించాను. ట్వీట్లు కొన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తాయి. కులం కంటే మనం చేసే మంచిపనులే గుర్తింపునిస్తాయని నేను నమ్ముతాను'' అంటూ ట్విట్టర్ లో స్పందించింది. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: