టాలీవుడ్ లో ఒకప్పుడు అంకుశం మూవీతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్.  ఈ మూవీలో నటించిన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన రాజశేఖర్ తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అయితే రాజశేకర్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ కావడంతో కొంత కాలం సినిమాకు దూరంగా ఉన్నారు. 

ఒకదశలో ఆయన కెరీర్ పూర్తయ్యిందని భావించారు. అంతలోనే రాజశేఖర్ విలన్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నారని రక రకాల కథనాలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ‘గరుడవేగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ అనుకున్నదానికన్నా మంచి హిట్ అయ్యింది..లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం  ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ మూవీలో నటించబోతున్నారు.

ఈ మూవీలో రాజశేఖర్ సరసన మాలీవుడ్ హాట్ బ్యూటీ అమలాపాల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అమలాపాల్ 'ఆమె'చిత్రంలో నగ్నంగా నటించిన సంచలనం సృష్టించింది. గ్లామర్ ఒలకబోసేందుకు అయినా, సాహసోపేతమైన పాత్రలు చేసేందుకు అయినా తాను సిద్ధం అని అమల అంటోంది. గతంలో తెలుగు లో  నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ, జెండాపై కపిరాజు లాంటి చిత్రాల్లో నటించింది.

సక్సెస్ రేట్ తక్కువున్నప్పటికీ అమలాపాల్ కు మంచి క్రేజ్ ఉంది. హీరో రాజశేఖర్ సరసన నటించేందుకు అమలాపాల్ ఒకే చెప్పినట్లు సమాచారం.  ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. అమలాపాల్ రాజశేఖర్ తో రొమాన్స్ చేయబోతున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజశేఖర్ ఈ ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులని పలకరించారు. తెలులో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి ఈ మూవీ కలిసి వస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: