నేచురల్ స్టార్ నాని కి మాస్ హీరోగా మాంచి రేంజే ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. నాని తో సినిమా అంటే నిర్మాత సేఫ్ గా ఉంటాడని అందరు ఫిక్సైపోతారు. అయితే గత కొంతకాలంగా నాని సినిమాలు వరుసగా ఫ్లాపవుతు వస్తున్నాయి. దాంతో కాస్త డైలామాలో పడ్డాడు. ఇక గ్యాంగ్ లీడర్ గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఆ తరువాత సినిమా ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న 'వి' సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ తరువాత ఏంటీ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్న. అయినా నాని చుట్టూ చాలామంది దర్శకులే క్యూ లో ఉన్నారు. అంతేకాదు నిర్మాతలు కూడా దర్శకులతోపాటే రెడీగా ఉన్నారు. 

ఇలా దర్శక నిర్మాతలు రెడిగా ఉన్నప్పటికి నాని మాత్రం ఎవరికి కమిటవ్వాలని డైలమాలో ఉన్నాడని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మజిలీ డైరక్టర్ శివనిర్వాణ నేచురల్ స్టార్ కి ఒక కథ చెప్పాడు. కాని ఇంకా శివనిర్వాణ కు కన్‌ఫర్‌మేషన్ ఇవ్వలేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నిన్ను కోరి వంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వరుస ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మ, హను రాఘవపూడి కూడా అవకాశం కోసం నాని ని అడుగుతున్నారు. అయితే వీటికి మించి ఇంకేదైనా మంచి ప్రాజెక్టు వస్తుందా అన్నదే నాని ఆలోచనట. గ్యాంగ్ లీడర్ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో నాని కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. అందుకే నాని ఇంకా ఏది ఫైనల్ చేయకుండా సైలెంట్‌గా ఉన్నాడని టాక్.

గత మూడు సినిమాలుగా కృష్ణార్జున యుద్దం, దేవదాస్ లాంటి మాస్ ఎంటర్ టైనర్ ట్రయ్ చేసాడు. జెర్సీ లాంటి క్లాస్ సినిమా చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా సరైన కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. అందుకే నాని ఆశలన్ని గ్యాంగ్ లీడర్ లాంటి క్లాస్ కామెడీ మీదే ఉన్నాయి. ఇక నాని తీసుకుంటున్న తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ నిలబడాలి, సినిమా సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? అనేదే నాని డైలమా అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: