ఈ ఎడారి 'జెర్సీ' వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక అదిరిపోయే రీతిలో చేశారు. ఇదిలా ఉండగా సినిమాలో విలన్ పాత్రలో నటించిన కార్తికేయ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వారు చిరంజీవి, రవితేజ ఇలాంటి పేర్లు ఎక్కువగా వినబడతాయి.


వాళ్లు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. అయితే ప్రస్తుత తరంలో మాలాంటి వాళ్లకు చాలా ఇన్స్పిరేషన్ నాని అని చెప్పాడు. నాని చిరంజీవి లాంటోడు అన్నట్టుగా ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలో ఎంత స్టేటస్ క్రేజ్ ఉన్న నాని స్టోరీ నమ్ముకొని సినిమాలు చేస్తాడని...అలాంటి నటుడితో ఈ సినిమా చేయడం నా అదృష్టం అని జీవితంలో మర్చిపోలేని మెమరీ అని కార్తికేయ చెప్పుకొచ్చారు.


ఇదే క్రమంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ గురించి కార్తికేయ మాట్లాడుతూ. దేశంలో ఉన్న దర్శకులు దారి ఒకదారైతే డైరెక్టర్ విక్రమ్ కుమార్ సార్ దారి మాత్రం వేరే దారి అని అందుకే విజయాలు అందుకుంటారని కార్తికేయ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఆయన డైరెక్షన్లో ఈ సినిమా చేయడం వల్ల నటించడం వల్ల నటనలో చాలా మెలుకువలు నేర్చుకున్నానని నా నటన మెరుగుపడింది అని కార్తికేయ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గురించి మాట్లాడుతూ...గతంలో ఈ సంస్థ నిర్మించిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ లాంటి విజయవంతమైన సినిమాలను పక్కన త్వరలోనే ఆ జాబితాలోకి 'గ్యాంగ్ లీడర్' సినిమా కూడా చేరబోతున్నట్లు కార్తికేయ చెప్పుకొచ్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: