మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న  సైరా నరసింహారెడ్డి చిత్రం మేనియా  అప్పుడే మొదలయింది . విజయదశమి పండుగను  పురస్కరించుకొని ఈ చిత్రాన్ని  అక్టోబర్ మొదటి వారంలో  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత రామ్ చరణ్,  దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. భారీ తారాగణం తో రూపొందిస్తోన్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఏకకాలం లో  తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


 సైరా నరసింహారెడ్డి చిత్రం లో చిరంజీవి జంటగా నయనతార నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్ , కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి , తమన్నా తో పాటు పలువురు కీలకపాత్రల్లో నటిస్తున్నారు . ఇక  చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రం   సూపర్ డూపర్ హిట్ కావడంతో,  సైరా నరసింహారెడ్డి పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కోసం నెట్ ప్లిక్స్,  అమెజాన్ లో పోటీ పడినట్లు తెలుస్తోంది.  సైరా నరసింహారెడ్డి సినిమా డిజిటల్  హక్కుల  కోసం నెట్ ఫ్లిక్స్ 30 కోట్ల వరకు  వెచ్చించేందుకు రెడీ గా ఉన్నప్పటికీ,  అమెజాన్ ఏకంగా 4 2.5 కోట్ల వరకు వెచ్చించి  సైరా నరసింహారెడ్డి చిత్రం డిజిటల్ రైట్స్  దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


 అన్ని భాషలలో డిజిటల్ రైట్స్ తో పాటు, ఈ సినిమాను నెల రోజుల వ్యవధిలోనే అమెజాన్ ద్వారా  విడుదల చేసుకునేలా ఒప్పందం కుదురడం వల్లే ఇంత భారీ మొత్తాన్ని చెల్లించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి .  తెలుగు సినిమాలకు డిజిటల్ రూపంలో ప్రస్తుతం  పెద్ద గా ఆదరణ లేకపోయినప్పటికీ,  భవిష్యత్తులో తప్పక ఆదరణ లభిస్తుందన్న ఆశతోనే భారీ మొత్తాన్ని వెచ్చించి , సైరా నర్సింహారెడ్డి డిజిటల్ హక్కులు అమెజాన్  దక్కించుకుని ఉండవచ్చునని  సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: