గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లకు మధ్య ఉన్న గ్యాప్ గురించి అనేక వార్తలు వచ్చాయి. దీనికితోడు బన్నీ ఒక ఫంక్షన్ లో పవన్ అభిమానులను ఉద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అన్న కామెంట్స్ చేయడంతో పవన్ వీరాభిమానులు అల్లు అర్జున్ ను విపరీతంగా టార్గెట్ చేయడమే కాకుండా బన్నీ నటించిన సినిమాల పై నెగిటివ్ ప్రచారం చేసే స్థాయికి వెళ్ళిపోయారు.

ఇలాంటి పరిస్థితులలో ఆమధ్య బన్నీ చరణ్ ల మధ్య గ్యాప్ పెరిగింది అంటూ వార్తలు కూడ వచ్చాయి. అయితే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ లో ధర్నా చేసినప్పుడు అతడికి మద్దతుగా బన్నీ అక్కడికి వెళ్ళడంతో పాటు ఈ మధ్య జరిగిన ఎన్నికలలో పవన్ కు తన సంఘీభావం తెలపడంతో పవన్ అల్లు అర్జున్ ల మధ్య ఏర్పడిన గ్యాప్ పూర్తిగా తొలిగిపోయింది అని అనుకున్నారు అంతా. 

అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ పవన్ ల మధ్య మరొక విషయంలో గ్యాప్ ఏర్పడింది అంటూ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టి సినిమాలకు దూరం కావడంతో అతడు తన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ పై కొన్ని సినిమాలు తీసే ఆలోచనలు చేస్తున్నాడు. ఈ విషయం గ్రహించిన రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లు పవన్ అడగకుండానే అతడి దగ్గరకు వెళ్లి తమను హీరోలుగా పెట్టి పవన్ సినిమాలు తీస్తే తాము అన్ని విధాల సహకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 

దీనితో మెగా యంగ్ హీరోలు తన పై చూపించిన అభిమానానికి పవన్ పొంగిపోయినట్లు టాక్. అయితే ఇలాంటి ఓపెన్ ఆఫర్ ఇప్పటి వరకు బన్నీ పవన్ ను కలిసి ఇవ్వకపోవడంతో పవన్ కొద్దిగా హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. తాను పాత విషయాలు మర్చిపోయి అల్లు అర్జున్ తో చాల సన్నిహితంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా బన్నీ ఇంకా తనతో పూర్తిగా కలవలేక పోతున్నాడు అంటూ పవన్ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేసినట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: