‘సాహో’ ఫెయిల్యూర్ కు కారణం సుజిత్ అంటూ వార్తలు వ్రాసిన జాతీయ మీడియా ఇప్పుడు షడన్ గా యూటర్న్ తీసుకుని ‘సాహో’ ఫెయిల్యూర్ కు రాజమౌళి ఐరన్ హ్యాండ్ కారణం అంటూ ఈరోజు ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. రాజమౌళి సినిమాలో హీరో ఛాన్స్ వస్తే చాలు అని చాలామంది భావిస్తారని అయితే ఆ చేతిలో ఉన్న పెనుప్రమాదం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు అంటూ ఆపత్రిక తన కథనంలో కామెంట్ చేసింది.

ఇలా రాజమౌళి ఐరన్ హ్యాండ్ బాధితుల లిస్టులో బాగా నష్టపోయిన ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ నాని నితిన్ ల గురించి ఆకథనంలో చాలవివరంగా ఉదాహరణలతో వివరింపబడింది. ఈలిస్టులో ప్రధమస్థానంలో జూనియర్ ఉన్నాడు. రాజమౌళితో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా చేసిన తరువాత జూనియర్ నటించిన తదుపరి సినిమా ‘సుబ్బు’ భంకరమైన ఫ్లాప్. ఆతరువాత రాజమౌళి జూనియర్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘సింహాద్రి’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వచ్చిన ‘ఆంధ్రావాలా’ ఫ్లాప్. మళ్ళీ రాజమౌళి జూనియర్ లు కలిసిచేసిన ‘యమదొంగ’ తరువాత జూనియర్ ను ఫ్లాప్ లు వెంటాడాయి.

ఇక రామ్ చరణ్ కు మరిచిపోలేని ‘మగధీర’ సూపర్ హిట్ తరువాత చరణ్ నటించిన ‘ఆరెంజ్’ అతడి కెరియర్ లో ఒక పీడకల. అదేవిధంగా కమెడియన్ సునీల్ కు ‘మర్యాదరామన్న’ తో హిట్ లభించినా ఆతరువాత వచ్చిన ‘అప్పలరాజు’ మూవీ ఫ్లాప్. వీరంతా ఒకఎత్తు అయితే హీరో నాని రాజమౌళితో ‘ఈగ’ చేసి హిట్ సాధించినా ఆతరువాత అతడు నటించిన ఏటో వెళ్లిపోయింది మనసు దగ్గర నుండి 6ఫ్లాపులు వెంటాడిన విషయాన్ని ఈకథనంలో పేర్కొనబడింది. అదేవిధంగా ఈలిస్టులో నితిన్ కూడ స్థానం పొందాడు. ‘సై’ మూవీతో హిట్ కొట్టిన నితిన్ కు ఆ తరువాత వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ తో పాటు చాల ఫ్లాపులు వచ్చాయి. 

రాజమౌళికి అత్యంత సన్నిహితుడు ప్రభాస్ కు కూడ ఇదే సెంటిమెంట్ వెంటాడటం అత్యంత ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రభాస్ ను మాస్ హీరోగా నిలబెట్టిన ‘ఛత్రపతి తరువాత వచ్చిన ‘పౌర్ణమి’ సూపర్ ఫ్లాప్. అదే సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేస్తూ ‘బాహుబలి’ తరువాత వచ్చిన ‘సాహో’ మూవీ వల్ల సుమారు 100 కోట్లకు పైగా నష్టం బయ్యర్లకు వస్తున్న నేపధ్యంలో రాజమౌళితో సినిమా చేసిన తరువాత తమ తదుపరి సినిమాలను చేసే హీరోలకు జక్కన్న ఐరన్ హ్యాండ్ సెంటిమెంట్ జీవితాంతం గుర్తుండి పోతుంది అంటూ ఆపత్రిక చేసిన కథనం ఎవరికైనా అదొక సెంటిమెంట్ అని అనిపిస్తుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: