Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:22 pm IST

Menu &Sections

Search

తెలుగు తెర‌కు మ‌రో విజ‌య‌శాంతి దొరికిందంటున్న వి.వి.వినాయ‌క్‌

తెలుగు తెర‌కు మ‌రో విజ‌య‌శాంతి దొరికిందంటున్న వి.వి.వినాయ‌క్‌
తెలుగు తెర‌కు మ‌రో విజ‌య‌శాంతి దొరికిందంటున్న వి.వి.వినాయ‌క్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా  హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్రం టీజర్  నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సెప్టెంబర్ 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్డీఎక్స్ లవ్  థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో తేజస్ కంచర్ల, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు శంకర్ భాను, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొనగా నిర్మాత సి.కళ్యాణ్ బొకేలతో అతిధులకు స్వాగతం పలికారు. 


సెన్సషనల్ డైరెక్టర్ వి.వివి.వినాయక్ మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు డబ్బులకోసం కాకుండా నిత్యం ఫ్యాషన్ తో సినిమాలను తీస్తున్నారు. ఈ కథని నమ్మి బడ్జెట్ కి వెనుకాడకుండా చాలా రిచ్ గా ఆర్డీఎక్స్ లవ్ చిత్రాన్ని నిర్మించారు. నా స్నేహితుడు శంకర్ భానుకి చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా థాంక్స్. ఈ చిత్రంతో కళ్యాణ్ గారు పెద్ద హిట్ కొట్టబోతున్నారు. దర్శకుడు  శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్  చేసాడు. చాలా తెలివైన వాడు. చాలా మంచి సినిమాలు చేసాడు.. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా భానుకి  పెద్ద బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్, పాయల్ పెయిర్ చాలా బాగుంది. ఈ సినిమా వాళ్ళిద్దరికీ మంచి పేరు తేవాలి. అలాగే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో విజయశాంతి గారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి అన్నారు.
 
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ కి  4 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశానో అది ఆర్డీఎక్స్ లవ్ బ్లాస్ట్ అయి నిరూపిస్తుంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కామెంట్స్ చేసారు.. అలాగే గొప్పగా ఉందని పొగిడిన వారు వున్నారు. ఒక యుక్త వయసులో వున్న అమ్మాయి ఎంజాయ్ చేసే టైములో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుప్రక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఏవిధంగా పోరాడిందనేది చిత్ర కథాంశం. డెఫినెట్ గా ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద బ్లాస్ట్ అవుతుంది అన్న నమ్మకంవుంది. ఈ చిత్రం తర్వాత పాయల్ మరో  విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. విజయవాడ, పోలవరం, రంపచోడవరమ్ లలో 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా నటీనటులు, టెక్నీషియన్స్ అందరు ఎంతో  కస్టపడి వర్క్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సహకారం మరువలేనిది. చిన్న బడ్జెట్ లో కాకుండా కథని నమ్మి పెద్ద బడ్జెట్ లోనే 75 రోజుల పాటు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా తీశాం. అందుకొనే చాలా రిచ్ గా విజువల్స్ వున్నాయి. ఒక కసితో గొప్ప సినిమా తియ్యాలని చేశాను. హీరో తేజస్, పాయల్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. రథన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆదిత్య మీనన్ విలన్ గా నటించాడు. నరేష్, తులసీల నటన క్లైమాక్స్ లో కంట తడి పెట్టిస్తుంది. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రెడిట్ భానుకె దక్కుతుంది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 


హీరో తేజస్ కంచెర్ల మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో సినిమాని అందరమ్  కష్టపడి చేసాం. టీజర్ కి రకరకాల కామెంట్లు వచ్చాయి.  ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలుస్తుంది. పాయల్ బాగా కోపరేట్ చేసి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ శంకర్ భాను చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినాయక్ గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు. 
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. "ఆర్ ఎక్స్ 100" చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ఆర్డీఎక్స్ లవ్ చిత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింప చేస్తూ.. ఇన్స్పిరేషన్ గా ఈ చిత్రం నిలుస్తుంది. వెరీ హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇంత మంచి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, భాను గారికి నా థాంక్స్.. అన్నారు.
 
దర్శకుడు శంకర్ భాను మాట్లాడుతూ.. కథ విని కళ్యాణ్ గారు  ప్రోత్సహించారు. కథ కి  ఏంకావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి సూపర్బ్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని కళ్యాణ్ గారు నిర్మించారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. తేజస్, పాయల్ ల మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. రాంప్రసాద్ కెమెరా వర్క్, ఆర్ట్ చిన్న సెట్ వర్క్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. రథన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్డీఎక్స్ లవ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను. ఈ బ్లాస్టింగ్ హిట్ తో కళ్యాణ్ గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపినీ అవుతుంది. ఈ మూవీ తరువాత ఈ బ్యానర్ లో వరుస కమర్షియల్ సక్సెస్ లు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను... అన్నారు.


telugu teraku maro vijayashanti dorikindantunna v.v.vinayak
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
హిందీ సాధ్యం కాదంటున్న త‌లైవా
టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజున‌ జ‌య‌సుధ‌కు మంచి గిఫ్ట్‌
చిరు బ‌యోపిక్‌లో రామ‌చ‌ర‌ణా..? వ‌రుణ్‌తేజా..?
చంద‌మామ తాజ్ మ‌హ‌ల్‌కి వెళ్ళిందా... ఎందుకు?
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో క‌మ‌ల్‌హాస‌న్‌....?
శోభ‌న్‌బాబు షూతో వ‌రుణ్ డ్యాన్స్‌
'దేవత'చిత్రంతో 'వాల్మీకి' ని పోల్చిన ద‌ర్శ‌కుడు
చ‌ల‌ప‌తిరావుకి ఒక దశలో చచ్చిపోవాలనిపించిందంట‌...?
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.