మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మొదలయ్యాయి.  అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.  మరలా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంతో పడిపోయారు.సైరా మేకింగ్ వీడియో రిలీజ్ డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  సైరా నుంచి అధికారికంగా పోస్టర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది.    ఇక ఈ పోస్టర్ లో మెగాస్టార్ ఆయుధాలు పట్టుకొని సీరియస్ గా నడుచుకుంటూ వస్తున్న దృశ్యం ఉన్నది.   పాన్ ఇండియా మూవీగా తెరేకేక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార తదితరులు నటిస్తున్నారు.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.  


 సైరా సినిమాలో క్లైమాక్స్‌కు ముందు వ‌చ్చే యుద్ధ స‌న్నివేశం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి చెప్పారు. ఇక విరామానికి ముందు వ‌చ్చే ఒక యాక్ష‌న్ సీన్‌ను ముంబైలోని భారీ స్విమ్మింగ్ పూల్‌లో తీశామ‌ని, ఈ సీన్ చూస్తున్నంత సేపు ఒళ్లు గ‌గురుపొడుస్తుంద‌న్నారు. సైరాలోని పోరాట స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటాయ‌ని సురేంద‌ర్‌రెడ్డి చెప్పారు.


తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి న‌ట‌న ఎలా ఉండ‌బోతుందో చూడాలి. కడప కేంద్రంగా బ్రిటిషర్లపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ భారీ బడ్జెత్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది.ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ హీరోగా నటించిన చిరంజీవి అక్కడి ప్రేక్షకులకు కొత్త కాదు. మరోవైపు కేంద్ర మంత్రిగా కూడా దేశమంతా చిరంజీవి సుపరిచితులు. దీనికితోడు సైరా నరసింహారెడ్డిలో కాస్ట్ అండ్ క్రూ కూడా అంచనాలకు మించి వుండటంతో సెట్స్ పైకి వెళ్లకముందే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: